మళ్లీ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు: సింగర్
హాలీవుడ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్‌పై ఇంటర్నెట్ హ్యాకర్ సృష్టించిన రూమర్‌లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇంతకీ రూమర్ ఏంటంటే జెన్నిఫర్ లోపెజ్ త్వరలో తన కొత్త డ్యాన్సర్ బాయ్ ప్రెండ్ 'క్యాప్సర్ స్మార్ట్' తో వివాహానికి సిద్దమైందంటూ వార్త హాల్ చల్ చేస్తుంది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ 'రోబర్ట్ కావెల్లీ' ట్విట్టర్ ఎకౌంట్‌ని ఓ ఇంటర్నెట్ హ్యాకర్ హ్యాక్ చేసి తన ట్విట్టర్‌లో రోబర్ట్ కావెల్లీ పోస్ట్ చేసినట్లు 'ఈరోజు జెన్నిఫర్ లోపెజ్ నాకు ఫోన్ చేసి తన కోసం ప్రత్యేకంగా ఓ డ్రెస్‌ని తయారుచేయమందని.. అది తన వివాహానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉండాలని.. ఎటువంటి కలరైతే సరిపోతుందే.. సలహా ఇవ్వాల్సిందిగా కోరిందని' ట్వీట్ చేశాడు.
దీంతో జెన్నిఫర్ లోపెజ్ ఫ్యాషన్ డిజైనర్ 'రోబర్ట్ కావెల్లీ' కి ఫోన్ చేసి అడడగా.. తన ట్విట్టర్ ఎకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేసి అలా ట్వీట్ చేశాడని.. ఆ ట్వీట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ వెడ్డింగ్ రూమర్‌పై జెన్నిఫర్ తాను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని అదంతా అబద్దం అని తేల్చేశారు. దీనిపై తన అభిమానులకు సంక్షిప్తంగా వివరణ ఇస్తూ తన వెబ్‌సైట్‌లో 'రోబర్ట్ కావెల్లీ' ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ చేయబడింది. ఇది నిజం. నా వివాహం కాదని వ్రాశారు.
ఇటీవలే జెన్నిఫర్ లోపెజ్ ఏడు సంవత్సరాలు కలసి ఉన్న తన భర్త మార్క్ ఆంటోని నుండి రెండు రోజలు క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తే చివరకు జెన్నిఫర్ లోపెజ్, విలియమ్ లెవీకు మద్య ఉన్న శారీరక సంబంధమే భార్యభర్తలు విడిపోవడానికి కారణం అని తెలిసింది. అమెరికన్ యాక్టర్ అయినటువంటి విలియమ్ లెవీ, జెన్నిఫర్ లోపెజ్ ఇద్దరూ కలసి 'ఐయామ్ ఇన్‌టు యు' అనే మ్యూజిక్ వీడియోలో కలసి నటించడం జరిగింది.


Click it and Unblock the Notifications











