గర్ల్‌ప్రెండ్ పేరు టాటూగా బొడ్డు క్రింద..?
నటి జెన్నిఫర్ లోపెజ్ యొక్క ప్రియుడు క్యాప్సర్ స్మార్ట్, ఆమెకు తన భావాలను వ్యక్తపరచటానికి తన బొడ్డు క్రింద ఆమె పేరుని టాటూగా వేయించుకున్నాడు.
క్యాప్సర్ వేయించుకున్న టాటూ జెన్నిఫర్‌కు నచ్చడమే కాకుండా చాలా సెక్సీగా ఉందని కితాబు ఇచ్చినట్లు సమాచారం. జెన్నిఫర్‌ని క్యాప్సర్ స్మార్ట్ ప్రేమించడం వల్లనే ఈ టాటూ వేయించుకున్నట్లు పలువురి అభిప్రాయం. 42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్, వయసులో తనకంటే 18 సంవత్సరాలు చిన్నవాడైన క్యాప్సర్ స్మార్ట్‌తో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల వీరిద్దరి మద్య సంబంధాన్ని గురించి జెన్నిఫర్ లోపెజ్‌ని ప్రశ్నించగా... నేను దీని గురించి పెద్దగా మాట్లాడదలచు కోలేదని స్పష్టం చేసారు. ఎందుకంటే ఈ విషయం మా పర్సనల్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











