ఆమె నిజంగా ఒక అద్భుతమైన నటి
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరో జాసన్ స్టాథమ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్‌తో కలసి పని చేయడాన్ని ఆస్వాదిస్తానని అన్నారు. ఇక వివరాల్లోకి వెళితే జాసన్ స్టాథమ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇద్దరూ ఇటీవల ఓ క్రైం ధ్రిల్లర్ సినిమా 'పార్కర్' లో నటించారు. ఈ సందర్బంలో జాసన్ స్టాథమ్ ఆమె గురించి మాట్లాడుతూ ఆమెతో కలసి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమె గొప్ప వ్యక్తి, ఆమెతో సినిమా షూటింగ్ మొత్తం సరదాగా గడిచిపోయింది. జెన్నిఫర్ లోపెజ్ బ్రిలియంట్. ఆమె నిజంగా ఒక అద్భుతమైన నటి అంటూ తెగ ప్రశంసలతో ముంచెత్తాడు.
ఇక క్రైం థ్రిల్లర్ పార్కర్ కథ విషయానికి వస్తే డోనాల్డ్ వెస్ట్ లేక్ వ్రాసిన పుస్తకం ఆధారంగా దీనిని రూపొందించారు. ఒక దొంగ బలవంతంగా కిల్లర్‌గా ఎలా మారడనేది కథాంశం.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ 'రోబర్ట్ కావెల్లీ' ట్విట్టర్ ఎకౌంట్‌ని ఓ ఇంటర్నెట్ హ్యాకర్ హ్యాక్ చేసి తన ట్విట్టర్‌లో రోబర్ట్ కావెల్లీ పోస్ట్ చేసినట్లు 'ఈరోజు జెన్నిఫర్ లోపెజ్ నాకు ఫోన్ చేసి తన కోసం ప్రత్యేకంగా ఓ డ్రెస్‌ని తయారుచేయమందని.. అది తన వివాహానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉండాలని.. ఎటువంటి కలరైతే సరిపోతుందే.. సలహా ఇవ్వాల్సిందిగా కోరిందని' ట్వీట్ చేశాడు.
జెన్నిఫర్ లోపెజ్ త్వరలో తన కొత్త డ్యాన్సర్ బాయ్ ప్రెండ్ 'క్యాప్సర్ స్మార్ట్' తో వివాహానికి సిద్దమైందంటూ వార్తలు వస్తున్న నేపద్యంలో జెన్నిఫర్ లోపెజ్ ఫ్యాషన్ డిజైనర్ 'రోబర్ట్ కావెల్లీ' కి ఫోన్ చేసి అడగగా.. తన ట్విట్టర్ ఎకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేసి అలా ట్వీట్ చేశాడని.. ఆ ట్వీట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ వెడ్డింగ్ రూమర్‌పై జెన్నిఫర్ తాను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని అదంతా అబద్దం అని తేల్చేశారు. దీనిపై తన అభిమానులకు సంక్షిప్తంగా వివరణ ఇస్తూ తన వెబ్‌సైట్‌లో 'రోబర్ట్ కావెల్లీ' ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ చేయబడింది. ఇది నిజం. నా వివాహం కాదని వ్రాశారు.


Click it and Unblock the Notifications











