twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: ప్రముఖ స్టార్ హీరో రేప్ చేశాడంటూ కేసు పెట్టిన మహిళా అభిమాని!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ప్రముఖ స్టార్ హీరో రేప్ చేశాడంటూ కేసు పెట్టిన మహిళా అభిమాని

    హాలీవుడ్ స్టార్, యాక్షన్ చిత్రాల హీరో సిల్వెస్టర్ స్టోలెన్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు పెట్టింది ఆయన్ను అమితంగా ఇష్టపడే మహిళా అభిమాని కావడం గమనార్హం. 71 ఏళ్ల ఈ స్టార్ హీరోపై ఇలాంటి కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు లాస్ఏంజెల్స్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ప్రతినిధులు వెల్లడించారు.

     28 ఏళ్ల క్రితం ఘటన

    28 ఏళ్ల క్రితం ఘటన

    28 ఏళ్ల క్రితం స్టోలెన్ తనపై బలాత్కారం చేశాడని, ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించారని, అందుకే ఈ విషయాన్ని ఇంతకాలం బయట పెట్టలేదని బాధిత మహిళ పేర్కొన్నారు. ఆటోగ్రాఫ్ కోసం అతడి వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘాయిత్యం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    శాంటా మోనికా నుండి కేసు బదిలీ

    శాంటా మోనికా నుండి కేసు బదిలీ

    ఈ కేసుకు సంబంధించిన వివరాలు కాలిఫోర్నియా రాష్ట్రంలోని బీచ్ సిటీ శాంటా మోనికా పోలీసుల నుండి లాస్ ఏంజెల్స్ పోలీసులకు అందాయి. ఈ మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు లాస్ ఏంజెల్స్ డిస్ట్రిక్ట్స్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ రిస్లింగ్ తెలిపారు.

    ఆమెపై తిరిగి కేసు వేసిన సిల్వెస్టర్

    ఆమెపై తిరిగి కేసు వేసిన సిల్వెస్టర్

    సదరు మహిళపై సిల్లెవస్టర్ స్టోలెన్ కూడా తిరిగి కేసు పెట్టారు. తన క్లయింటుపై ఆమె తప్పుడు కేసు పెట్టిందని, ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సిల్వెస్టర్ స్టోలెన్ తరుపు న్యాయవాది మార్టిన్ సింగర్ పేర్కొన్నారు.

    హాలీవుడ్లో వరుస కేసులు

    హాలీవుడ్లో వరుస కేసులు

    హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని నెలలుగా ప్రముఖ స్టార్లపై లైంగిక వేధింపులకు సంబంధించి వరుస కేసులు నమోదువుతున్నాయి. నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ మీద గత నెలలో లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2004లో మహిళను లైంగికంగా వేధించిన కేసులో కమెడియన్ బిల్ కోస్బీపై కూడా ఏప్రిల్ నెలలో కేసు నమోదైంది.

    English summary
    Los Angeles District Attorney’s office spokesman Greg Risling did not give details but said the case was presented by police in the California beach city of Santa Monica.Representatives for Stallone, 71, did not immediately return a call for comment on Wednesday.In December, Stallone’s attorney Martin Singer said that a woman had “filed a police report alleging a rape that occurred 27 years ago.” “My client categorically disputes the claim,” Singer said in a statement at the time.Santa Monica police said in December they were investigating a complaint that was made in November 2017 of alleged sexual misconduct in the 1990s by the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X