డేటింగ్ రూమర్స్: నాకు మంచి స్నేహితుడంటున్న సింగర్
లండన్, జూన్ 1: 'వన్ డైరెక్షన్' సింగర్ నియాల్ హోరన్ తో డేటింగ్ చేస్తుందంటూ వచ్చిన వార్తలపై హాలీవుడ్ ప్రముఖ సింగర్ డెమి లోవాటా కొట్టి పారేశారు. ఈ సందర్బంలో డెమి లోవాటా మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా ఐరిష్ సింగింగ్ సెన్సేషన్ అయిన నియాల్ హోరన్‌తో నేను డేటింగ్ చేస్తున్నానంటూ వస్తున్న ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదు. మా ఇద్దరి వృత్తి ఒకటే కావడంతో నేను అతనితో సన్నిహితంగా మెలుగుతున్నాను. నిజం చెప్పాలంటే నియాల్ హోరన్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని అన్నారు.
అతను నిజంగా చాలా మంచి వాడు, నాకున్న మంచి స్నేహితులలో నియాల్ హోరన్ ఒకడు. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం నేను సింగిల్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇలానే మరి కొంత కాలం గడపాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా నా కెరియర్‌పైనే ఉందని తెలిపింది.
అమెరికా టాలెంట్ షో 'ది ఎక్స్ ఫ్యాక్టర్' రెండవ సీజన్‌లో డెమి లోవాటా జడ్జి ప్యానెల్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహారిస్తున్నారు. ఈ రెండవ సీజన్‌లో పాల అబ్దుల్ మరియు నికోలే షెర్జింజర్ స్దానంలో జడ్జిలుగా బ్రిట్నీ స్పియర్స్, డెమి లోవాటాలు వస్తున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











