ప్రేమలో పడ్డ స్లమ్ డాగ్ జంట
'స్లమ్ డాగ్ మిలియనీర్' మన భారతీయులు మరచిపోలేని సినిమా.. అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఆస్కార్ అవార్డుని అందేలా చేసిన సినిమా ఇది. జంట ఆస్కార్ లను రెహమాన్ ఇంటిముంగిట వాలేలా చేసిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఈ సినిమాలో ప్రేమికులుగా నటించిన జంట దేవ్ పటేల్, ఫ్రిదా పింటో లు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపును పొందారు. సినిమాలో ప్రేమికులుగా నటించిన వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమలో పడ్డారట.
తొలుత ఈ వార్తలను ఖండించిన వీరు ప్రస్తుతం ఎలాంటి సంకోచం లేకుండా బాహాటంగా ఒప్పుకొంటున్నారట. ఐతే ఈ ప్రేమకథ ఎంత వరకూ సఫలం అవుతందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా వుంటే స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా యూరోపియన్ ఫిలిం అవార్డ్స్ లో ఐదు విభాగాల్లో నామినేషన్ పొంది తిరిగి తన సత్తాను చాటుకొంది.
స్లమ్ డాగ్ దేవ్ పటేల్ ఫ్రిదా పింటో హాలీవుడ్ యూరోపియన్ ఫిలిం అవార్డ్స్ slumdog millionaire dev patel freida pinto hollywood european film awards


Click it and Unblock the Notifications