ఐశ్వర్య కూతర్ని(బేటి బి)ని దీవించిన ఓఫ్రా విన్‌ఫ్రే
ముంబై: డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ఇండియాకు వచ్చిన 57 సంవత్సరాల అమెరికన్ టీవీ మొఘల్, టాక్ షో క్వీన్ ఓఫ్రా విన్‌ఫ్రేను కలిసేందుకు బాలీవుడ్ తారలు 'క్యూ' కట్టారు. తొలిసారి భారత పర్యటనకు వచ్చిన విన్‌ఫ్రేకు పరమేశ్వర్ గోద్రేజ్ విలాసవంతమైన విందును ముంబైలో ఏర్పాటు చేశారు.
ఈ విందులో బాలీవుడ్ తారలు అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్‌ఖాన్, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, లారా దత్తా, శిల్పాశెట్టి, అనిల్ కపూర్, ఇమ్రాన్ ఖాన్, నేహా దూపియా, సమీరారెడ్డి, డినో మారియా, ప్రముఖ రచయిత్రి శోభా డే, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ ఆలీలతో పాటు ఫిల్మ్ మేకర్స్ రాజ్ కుమార్ హీరాణి, అశుతోష్ గోవార్కిర్ హాజరయ్యారు. ఆరంజ్ రంగు చీరను ధరించి విన్‌ఫ్రే పార్టీలో హల్‌చల్ చేశారు. ఓఫ్రా విన్‌ఫ్రే కలిసిన తర్వాత బాలీవుడ్ నటులు వారి యొక్క అనుభూతిని ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ముంబైలో అడుగుపెట్టిన ఓఫ్రా విన్‌ఫ్రే ముందుగా.. అమితాబ్ కుటంబాన్ని కలుసుకున్నారు. తమ ఇంటి(జల్సా)ని విన్‌ఫ్రే సందర్శించిందని.. ఐశ్వర్య కూతుర్ని ముద్దు పేరు(బేటి బి)ని దీవించిందని.. చీరలో ఓఫ్రా చాలా అందంగా ఉందని అమితాబ్ ట్విట్టర్‌లో ప్రశంసల్ని కురిపించాడు. 2005లో ఐశ్వర్యరాయ్ తొలిసారిగా విన్‌ఫ్రే టాక్‌షోలో పాల్గొన్నారు. 2009లో తన భర్త అభిషేక్‌తో కలిసి టాక్‌షోకు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











