ట్రేసీ నుండీ విడిపోయిన మడోన్నా
ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా తన వ్యక్తిగత శిక్షకుడు ట్రేసీ అండర్ సన్ నుండీ విడిపోయింది. గ్వినెత్ పాల్త్రో మరియు మొల్లీ సిమ్మ్ వంటి ఎంతో మంది సెలబ్రిటీలకు వ్యక్తిగత శిక్షకుడిగా పనిచేసిన ట్రేసీ మూడేళ్ల క్రితం మడోన్నా కు శిక్షకుడిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవలే రయాన్ సీక్రెట్స్ KISS-FM కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ 51 ఏళ్ల పాప్ రారాణి తాను ట్రేసీ తో కలసి పనిచేయడం లేదని ప్రకటించింది.
ట్రేసీ ఇచ్చే శిక్షణతో విసుగెత్తి మడోన్నా ఈ నిర్ణయం తీసుకుందనే వదంతులు వినిపిస్తున్నాయి. కానీ ఈ గాలి వార్తలను ట్రేసీ కు సంబంధిత వ్యక్తులు ఖండిస్తున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే వారు స్నేహపూర్వకంగా విడిపోతున్నారని అంటున్నారు. మూడేళ్లు కలసి పనిచేసిన తర్వాత అభిప్రాయబేధాల వల్ల విడిపోయారనడం అర్థరహితం అనీ, ట్రేనీ తన కొడుకును చూసుకోవలనే ఒకే కారణం మీద వారు విడిపోతున్నారని ట్రేనీ శ్రేయోభిలాషు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











