పాప్ రారాణి మడోన్నా దూరదృష్టి
హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నా చేసిన ఆల్బమ్ హార్డ్ క్యాండీ. ఏప్రిల్ 25, 2008న విడుదలయిన మడోన్నా చేసిన పదకొండవ స్టుడియో ఆల్బమ్ అయిన ఈ హార్డ్ క్యాండీ మంచి విజయాన్ని సాధించింది. 2008వ సంవత్సరానికి గాను ప్రపంచంలో 11వ ఉత్తమ ఆల్బమ్ గా నిలిచింది. హార్డ్ క్యాండీ గా రూపొందిన ఈ ఆల్బమ్ గురించి ఈ పాప్ రారాణి 'రోలింగ్ స్టోన్ మ్యాగ్జయిన్' కు ఇచ్చిన ఇంటర్యూలో ఓ విషయాన్ని బహిర్గతం చేసింది. అదేంటంటే మొదట ఈ ఆల్బమ్ కు 'బ్లాక్ మడోన్నా' అనే పేరు పెట్టాలనుకుందట. దీనికి కారణం ఈ ఆల్బమ్ లో మడోన్నా మొహం మొత్తం నల్లగా, తెల్లటి కళ్లతో విచిత్రంగా కనిపిస్తుంది. దీంతో ఈ పేరు పెట్టాలనుకుందట. కానీ ఈ పేరు మరీ రెచ్చగొట్టేలా, కొందరి మనోభావాలను దెబ్బతీసేదిగా వుండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొందట. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తోంది మడోన్నాకు దూర దృష్టి ఎక్కవ అనిపించడం లేదూ!!!
మడోన్నా పాప్ రారాణి బ్లాక్ మడోన్నా హార్డ్ క్యాండీ రోలింగ్ స్టోన్ మ్యాగ్జయిన్ madonna queen of pop black madonna hard candy rolling stone magazine


Click it and Unblock the Notifications