మైఖేల్ తో ఒక్క డ్యూయెట్టూ తీయలేకపోయాం
పాప్ సామ్రాజ్యాన్ని శాసించిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ చాలా బిడియస్తుడట. ఆయనకున్న సిగ్గు, మొహమాటం కారణంగా ఆయనతో ఒక్క డ్యూయెట్ కూడా రికార్డు చెయ్యలేకపోయామని పాప్ గాయని మడోన్నా తెలిపింది. ఇటీవల జరిగిన ఎంటీవీ మ్యూజికల్ అవార్డుల సందర్భంగా తన స్నేహితుడైన దివంగత మైఖేల్ కు నివాళి అర్పించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైఖేల్ చాలా బిడియస్తుడని, అందువల్లే ఆయనతో కలసి ఓ డ్యూయెట్ పాటను కూడా రికార్డు చెయ్యలేకపోయామని, అలాంటి వ్యక్తిపై పసిపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నిరాధారమైన వార్తలను ప్రచారం చేసారని ఆవేధన వ్యక్తం చేసింది. దీనికి తోడు అతనో విచిత్రమైన వ్యక్తి అని మీడియాతో సహా అందరూ దూరంగా పెట్టారని మడోన్నా బాధపడ్డారు. జాక్సన్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమనీ, అలాంటి మిత్రుడు ఇప్పుడు మన మధ్య లేకపోవడం విచారించదగ్గ విషయని తెలిపారు.


Click it and Unblock the Notifications











