53వయసున్న భామకు.. కుర్ర బాయ్ ప్రెండ్ ప్రపోజ్
53 సంవత్సరాల వయసు కలిగిన అమెరికన్ పాప్ సింగర్, హీరోయిన్ మడోన్నాకు తన బాయ్ ప్రెండ్ 'బ్రాహిమ్ జైబ్యాట్' ప్రేమిస్తున్నట్లు ప్రపోజ్ చేశాడని ఓ ప్రముఖ దిన పత్రిక పేర్కోంది. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకోని విడాకులు తీసుకున్న మడోన్నా ఇప్పుడు మూడో సారి 'బ్రాహిమ్ జైబ్యాట్' ప్రపోజ్ చేసిన ప్రపోజల్‌కి ఓకే చెప్పేందుకు సిద్దమైనట్లు సమాచారం.
2010 నుండి 24 సంవత్సరాల వయసు కలిగిన ప్రముఖ ప్రెంచ్ డ్యాన్సర్ 'బ్రాహిమ్ జైబ్యాట్' తో డేటింగ్ చేస్తుంది. ప్రస్తుతం మడోన్నా తొందర పడి నిర్ణయం తీసుకోవడానికి సిద్దం లేకపోయినప్పటికీ... 'బ్రాహిమ్ జైబ్యాట్'తో సంతోషంగా ఉందని ఆమె తరపున వారు తెలిపారు. ఇది మాత్రమే కాకుండా మడోన్నా ఎప్పుడు కూడా తన జీవితంలో ఒంటరి జీవితాన్ని అనుభవించ లేదు.
ఒంటరి జీవితం నుండి తప్పించుకునేందుకే 'బ్రాహిమ్ జైబ్యాట్'తో డేటింగ్ చేస్తుందని పలువురి భావన. 24 సంవత్సరాల కుర్రాడు 'బ్రాహిమ్ జైబ్యాట్'డేటింగ్ తో చెయ్యడం వల్ల తాను సంతోషంగా ఉండడమే కాకుండా.. తాను కూడా యంగ్ ఆలోచనలతో ఉంటుందని తెలిపింది. మడోన్నా గతంలో సీన్ పెన్, గయ్ రిట్చీని వివాహాం చేసుకోని కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకుంది.


Click it and Unblock the Notifications











