తాగి స్టేజీపైకి రాలేదంటోంది
లాస్ ఏంజిల్స్ : ఓ స్ధాయికి వచ్చాక సెలబ్రెటీలు ప్రవర్తన రకరకాలుగా ఉంటోంది. ఎన్నో సార్లు వివాదాల్లో ఇరుక్కున్న మడన్నా ఈ సారి తాగి స్టేజిపైకి వచ్చి షో ఇచ్చిందని విమర్శలు ఎదుర్కొంది. అయితే తాను మద్యం తాగి స్టేజ్ షో ఇవ్వలేదని పాప్ సింగర్ మడోనా తెలిపారు. ఇటీవల ఆమె కెంటకీలో స్టేజ్ షో చేశారు.

అయితే.. ఆ షోకి ఆమె తాగి వచ్చారని కొందరు, ఆమె పాడాల్సిన పాట లిరిక్స్ మర్చిపోయి.. తాగినట్లు నటించారని మరికొందరు సోషల్‌మీడియాలో తీవ్రంగా విమర్శించారు. దీనిపై మడోనా ఈరోజు వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ మద్యం తాగి స్టేజ్ షో చెయ్యనని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
తాను రెండు గంటల 15 నిమిషాలపాటు వేదిక మీద నాన్‌స్టాప్‌గా నృత్యం చేస్తూ పాట పాడతానని, విమర్శలు చేసేవారు ఆ సంగతి గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. వేదికపై సరదాగా వేసిన ఓ జోక్‌ను అపార్థం చేసుకున్నారని మడొన్నా పేర్కొన్నారు. తాను మహిళ కాబట్టే ఇలా విమర్శిస్తున్నారని, అదే గాయకుడైతే ఇలా అనేవారా అంటూ ప్రశ్నించారు.



Click it and Unblock the Notifications











