నాతో డాన్స్ చేయాలంటే చాకులాంటి కుర్రాళ్శు అయి ఉండాలి..
పాప్ ప్రపంచానికి రాణి మడోన్నా తను చేయబోయేటటువంటి కొత్త ఆల్బమ్ కోసం చాకులాంటి కుర్రోళ్శ కోసం వెతుకుతున్నారని సమాచారం. 2008వసంవత్సరంలో విడుదలైనటువంటి మేటిరియల్ గర్ల్ అనే ఆల్బమ్ తర్వాత మడోన్నా ఇంతవరకూ కూడా కొత్త ఆల్బమ్ విడుదల చేయలేదు. హార్డ్ క్యాండీ వెంచర్ ద్వారా మరో కొత్త ఆల్బమ్ విడుదల చేయడానికి శ్రీకారం చుట్టారు మన పాప్ రాణి మడోన్నా.
ఈనెల మొదటి వారంలో హార్డ్ క్యాండీ ఫిట్ నెస్ సెంటర్ నుమెక్సికోలో ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. ఈఫిట్ నెస్ సెంటర్ల ద్వారా తనదైన ముద్రని వేశారు మడోన్నా. ఈఫిట్ నెస్ సెంటర్ల స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ ఫిట్ నెస్ అనేది మ్యూజిక్ రూపంలో లభిస్తుందన్నమాట. ఇలాంటి ఫిట్ నెస్ సెంటర్ల ప్రపంచం మొత్తం నెలకొల్పాలనేది తన ధ్యేయంగా పేర్కోన్న విషయం కూడా తెలిసిందే. ఇటీవల తన ఫేస్ బుక్ ఎకౌంట్ లోమడోన్నా త్వరలో తానోక బ్రహ్మాండమైన ఆల్బమ్ రూపోందించడానికి సన్నాహాలు చేస్తున్నానని, అందుకే నేను డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నానని తెలియజేశారు.
చివరగా ఈఆల్బమ్ లోనాతో పనిచేయడానికి చాకులాంటి కుర్రాళ్శు కావాలని అన్నారు. ఆకుర్రాళ్శు ఎలా ఉండాలంటే ఎంత చెడ్డగా ఉంటే అంత మంచిగా నాకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. అలాంటి వాళ్శతోనే నేను ఆల్బమ్ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











