మడోన్నాకు అతన్ని వదిలి వుండటం చాలా కష్టంగా వుందట
హాలీవుడ్ నటి, పాప్ రారాణి మడోన్నాకు తన మాజీ భర్త గయ్ రిట్చీని వదిలి వుండటం చాలా కష్టంగా వుందట. ఎనిమిదేళ్లు భార్యభర్తలుగా చెలామణీ అయిన వీరు అభిప్రాయ భేదాల వల్ల విడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల స్పందించిన మడాన్నా పై విధంగా చెప్పుకొచ్చింది. ఎనిమిదేళ్లు కలిసి వున్న అతన్ని మరవడం చాలా కష్టం అని అతను లేని ఈ రోజులు చాలా కష్టంగా వున్నాయని తెలిపింది.
వీరి సంతానం రోక్కో (8), డేవిడ్ (5) వారి తండ్రి వద్దే యుకే లో వున్నారు. వీరికి దూరంగా వుండటం కూడా తనని బాధిస్తోందని చెప్పింది. జీవితమంటేనే రాజీ అని, తన పిల్లలు తనకి దూరంగా వారి తండ్రి దగ్గర వుండటం తనకి ఇబ్బందిగా వుందని, కానీ తనకి కావాల్సినంత, చేయాల్సినంత పని వుండటం సంతోషించదగ్గ విషయమని తన మనోభావాలను ఆవిష్కరించింది.


Click it and Unblock the Notifications











