పాపం ఆమె పరిస్దితి..బిల్డప్ ఎక్కువ బిజెనెస్ తక్కువ

By Srikanya

బాలీవుడ్‌ హాట్‌ భామ మల్లికా షెరావత్‌ హాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం 'హిస్‌..స్‌"బాలీవుడ్‌లోలానే తుస్‌మనిపించింది. మల్లిక అందాలు ఆ చిత్రాన్ని ఏరకంగానూ కాపాడలేకపోయాయి. ఆ చిత్రం తర్వాత ఎప్పుడో రెండేళ్ల క్రితం షూటింగ్‌ మొదలెట్టిన 'లవ్‌ బారక్‌-పాలిటిక్స్‌ ఆఫ్‌ లవ్‌" చిత్రం రీసెంట్‌గా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విలియం డియర్‌ ఈ చిత్రం ప్రమోట్‌ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.ఇంతవరకూ ఈ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని డివిడిలలోకి మార్చి కనీసం ఆ రకంగానైనా క్యాష్‌ చేసుకుందామనుకుంటున్నారట. ఒబామా అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఉన్న హవా..ఇప్పుడు అంతగా లేకపోవడం కూడా ఈ చిత్రానికి మైనస్‌ పాయింట్‌గా మారింది.ఈ చిత్రాన్ని లేట్‌ ప్రాజెక్టుగా విడుదల చేయడం కూడా ఈ సినిమాకు శాపంగా మారింది. కనీసం హాలీవుడ్‌లోనైనా తన అందంతో జనాన్ని పడగొట్టేద్దామనుకున్న మల్లికకు అక్కడ కూడా కాలం కలిసిరాకపోవడంతో విచారవదనంతో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X