twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్యకు విడాకులు.. వేరొకరితో డేటింగ్...

    By Nageswara Rao
    |

    నిజ జీవితంలో ఏడు సంవత్సరాలు కలసి జీవించిన తర్వాత కొన్ని అనవసరపు కారణాల వల్ల ఇటీవల జెన్నిఫర్ లోపెజ్, మార్క్ ఆంటోని విడిపోయిన సంగతి తెలిసిందే. సాధారణంగా హాలీవుడ్లో ఏదైనా జంట విడిపోయిందంటే మరలా ఆ జంట కలవడం అనేది జరగని పని. ఇది జరగకపోగా వేరే వారితో అక్రమ డేటింగ్ చేయడం వారికి సర్వసాధారణం. జెన్నిఫర్ లోపెజ్, మార్క్ ఆంటోని విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇదే జరుగుతుంది.

    జెన్నిఫర్ లోపెజ్ భర్త సింగర్ మార్క్ ఆంటోనీ తన భార్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత మెక్సికన్ మోడల్ 'అడ్రియానా ఓంటివిరోస్'‌తో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు హాలీవుడ్లో సంచరిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే 28 సంవత్సరాల వయసు కలిగిన 'అడ్రియానా ఓంటివిరోస్'‌ రూపొందించిన 'ఐ నీడ్ టు నో' ఆల్బమ్ హిట్ అయిన సందర్బంగా వీరిద్దరూ డిసెంబర్ 11న కలిశారు. ఆ తర్వాత మార్క్ ఆంటోనీ స్నేహితుడు ఆలెజాండ్రో ఫెర్నాడ్‌ కలవాలనే వంకతో 'అడ్రియానా ఓంటివిరోస్'‌ కూడా ఆహ్వానించే వాడని సమాచారం.

    ఆ తర్వాత ముగ్గురు కలసి మియామిలో ఉన్న డాల్ఫిన్స్ హోం పుట్‌బాల్ గేమ్ చూసేందుకు వెళ్లగా.. అడ్రియానా ఓంటివిరోస్, మార్క్ ఆంటోని ఇద్దరూ కూడా ప్రయివేట్‌గా ఎలివేటర్ ద్వారా గ్రౌండ్ లోకి వెళ్లారు. ఇద్దరూ చేతిలో చేతులు వేసుకొని, చాలా యేళ్లుగా పరిచయం ఉన్నవారిలా కలసి తిరుగుతుండగా అక్కడున్న వారంతా దీనిని చూసి ఆశ్చర్య పోయారు. ఐతే వీరిద్దరి మద్య రొమాంటిక్ సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని చూపరులు మాత్రం వెల్లడించ లేదు. రెండు సార్లు గ్రామీ అవార్డుని సొంతం చేసుకున్న మార్క్ ఆంటోని ఈ కారణం వల్లనే తన భార్యకు విడాకులు ఇచ్చాడని అక్కడున్న వారు గుసగుసలాడుతున్నారని సమాచారం.

    English summary
    Singer Marc Anthony is said to have moved on after his split from wife Jennifer Lopez and is now dating Mexican model Adriana Ontiveros.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X