గర్ల ప్రెండ్ ముద్దు సీను ఫోటో ఫేస్‌బుక్‌లో
హాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. ఆ తర్వాత అదే జంట వేరోకరితో కలసి చెట్టా పట్టాలేసుకుని తిరగడం అంతా అక్కడ మామూలే. పెళ్లి చేసుకున్న తర్వాత ఏడు సంవత్సరాలు కలసి జీవించి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఆమె భర్త మార్క్ ఆంటోనీ. 42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్ తన భర్త నుండి విడాకులు తీసుకున్న వెంటనే 24 సంవత్సరాల వయసు కలిగిన క్యాస్పర్ స్మార్ట్‌తో డేటింగ్ చేస్తుంది.
జెన్నిఫర్ లోపెజ్, క్యాస్పర్ స్మార్ట్ ఇద్దరూ కలసి కొత్త సంవత్సర వేడుకలు మియామి బీచ్‌లో జరుపుకున్న ఫోటోలు ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. దీంతో మార్క్ ఆంటోనీ కూడా నేనేమన్న తక్కువ తిన్నానా అంటూ.. వెనిజులా మోడల్ 'షానన్ డి లిమా' ని తాను బాహు బంధాలలో బిగించి.. ముద్దుపెడుతున్న ఫోటోని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు.
ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యాజమాన్యం కూడా అంగీకరించింది. మార్క్ ఆంటోనీ తన పేజిలో ఈ ఫోటోని ఫోస్ట్ చేయడమే కాకుండా దాని క్రింద 'Gracias!' అంటూ క్యాప్సన్ కూడా పెట్టారు.


Click it and Unblock the Notifications











