అతను నన్నెంతగానో హింసించాడు..!!
ఆర్ అండ్ బి గాయని మారియా క్యారీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనని ఎంతో బాధించాడని చెప్పింది. ఈ 39 ఏళ్ల గాయని ఇటీవల CNN ఛానెల్ లో వస్తున్న ల్యారీ కింగ్ లైవ్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెళ్లడించింది. అతనెంతగానో దూషించే వాడని శారీరకంగా, మానసికంగా ఎంతో వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతను మానసికంగా గురిచేసిన ఇబ్బందులను తలచుకుంటే భయమేస్తుందని, అదంతా ఓ పీడ కలలా అనిపిస్తోందని పీపుల్స్ మ్యాగ్జయిన్ తో చెప్పినట్టు ఆ పత్రిక ఓ వార్తను ప్రచురించింది.
తనని తాను కట్టేసుకున్నట్టు అనిపించేదని, ఆ బంధం నుండీ బయటపడటానికి ఎంతో కష్టపడాల్సివచ్చిందని తన అనుభవాలను వివరించింది. తానొక తీగల్లో చిక్కుకున్న పావురంలా కొట్టుమిట్టాడానని, ఆ బంధం తన జీవితం లో ఓ చేదు నిజం అని చెప్పుకొచ్చింది.
ఆర్ అండ్ బి గాయని మారియా క్యారీ హాలీవుడ్ ల్యారీ కింగ్ లైవ్ పీపుల్స్ మ్యాగ్జయిన్ rnb singer mariah carey hollywood cnn larry king live


Click it and Unblock the Notifications