twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మతులు పొగొట్టిన హాలీవుడ్ భామ 'మార్లిన్ మన్రో'..!

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా ప్రపంచం మొత్తం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న 'మార్లిన్ మన్రో' చనిపోయి 50 వసంతాలు పూర్తైన సందర్బంగా మార్లిన్ మన్రో కొత్త ఇమేజిలతో 'మార్లిన్ బై మాగ్నమ్(Marilyn By Magnum)' పేరుతో కొత్త పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. 1952లో ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఫిలిఫ్పీ హాల్స్‌మ్యాన్ ఓ అపార్ట్‌మెంట్లో తీసిన ప్రయివేటు ఫోటోలను ఈ పుస్తకంలో ప్రచురించడం.. ఈ పుస్తకం యొక్క విశేషం.

    ఈ ఫోటోలలో మార్లిన్ మన్రో గులాబి సూట్‌ని ధరించి అమాయకంగా ఫోటోకు ఫోజులిచ్చింది. ఈ ప్రక్క చిత్రంలో ఉన్న ఇమేజిని చూస్తే మీకు అర్దమవుతుంది. ఈ ఫోటోలు మార్లిన్ మన్రో 'నయాగరా' సినిమాలో నటిస్తున్న సందర్బంలోనివి. ఈ ఫోటోలు తీసినప్పడు మార్లిన్ మన్రో వయసు 26 సంవత్సరాలు. అంతక ముందు మన్రో 'ఆల్ అబౌట్ ఈవ్' అనే సినిమాలో నటించినప్పటికీ 'బాగా నటించావు' అని అందరూ అంటున్నారుగానీ బ్రేక్ రాలేదు.

    మూడు సంవత్సరాల తరువాత 'నయాగరా' సినిమా రూపంలో ఆ బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా మన్రో నటించింది. ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేస్తుంది. 'నయాగరా' సూపర్ డూపర్ హిట్ కావడంతో మన్రో 'సెక్స్ సింబల్' అయిపోయింది. ఏ నోట విన్నా, ఏ మాట విన్నా ఆమె పేరే. హాలీవుడ్ 'మన్రో జ్వరంతో' మంచం పట్టింది.

    అప్పుడు విడుదలైన ఆమె హాటు సినిమాను చూసి లేచి హుషారుగా పరుగెత్తింది. ఆమె నటించిన 'హౌ టు మ్యారీ ఎ మిలియనీర్' సినిమా కూడా దుమ్ము లేపింది. భిన్నమైన గొంతు, భిన్నమైన హావభావాలు ఆమెకు ప్రత్యేక నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. విజయం మీద విజయం... విజయమే విజయం. ఇంటర్నేషనల్ స్టార్‌గా మన్రోకు గుర్తింపు వచ్చింది. లాస్ ఏంజిల్స్‌లోని మన్రో ఇంట్లో ఆగస్ట్ 5, 1962 మార్లిన్ మన్రో చనిపోయారు. మన్రో ఇంట్లోని బెడ్ దగ్గర స్లీపింగ్ పిల్స్ కనిపించాయి.

    36 సంవత్సరాల వయసులో చనిపోయిన మార్లిన్ మన్రోది కొందరు హత్య అన్నారు. మరి కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు 'డ్రగ్' ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే చనిపోయిందని అధికారికంగా ధృవీకరించారు.

    ఇక ఈ పుస్తకంలో ప్రచురించిన ఇమేజిలు అన్ని కూడా మాగ్నమ్ ఫోటోగ్రాఫిక్ కో ఆపరేటివ్ సొసైటీకి ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రోబర్ట్ కాపా, హెన్రీ కార్టర్-బ్రెన్సన్, జార్జీ రోజెర్ లాంటి ప్రముఖులు తీసినవి. ఈ పుస్తకాన్ని మొత్తం 80 ఫోటోలతో రూపొందించారు. అంతర్జాతీయ బుక్ మార్కెట్లో ఈ పుస్తకం ధర £19.99.

    English summary
    She's an icon whose photograph was taken thousands of times, which is why previously unpublished shots of Marilyn Monroe are still making it into the public domain some 50 years after her death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X