»   » ఈ సినిమా సగంలోనే సెక్సీ క్వీన్ మృతి,హత్యో,ఆత్మహత్యో, వేలానికి స్క్రిప్టు, ఆ సీక్రెట్స్ బయిటకు వస్తాయ

ఈ సినిమా సగంలోనే సెక్సీ క్వీన్ మృతి,హత్యో,ఆత్మహత్యో, వేలానికి స్క్రిప్టు, ఆ సీక్రెట్స్ బయిటకు వస్తాయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్: ఒక సర్వే సంస్థ ప్రకారం, కీర్తిశేషులైన వారి జాబితాల్లో ఉన్న అగ్రశ్రేణి మహిళా ప్రముఖుల్లో మార్లిన్‌ మన్రో ఒకరు! అంతేకాదు ఇప్పుడు కూడా ఆమె ఉపయోగించిన వస్తు వులు ఆక్షన్‌ హాలుకు వస్తే, లక్షలకు లక్షల డాలర్లు ఇచ్చి సొంతం చేసుకునే అభిమానులు కోకొల్లలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే...ఆమె రాసిన చివరి స్క్రిప్టు వేలానికి పెట్టారు. అభిమానులు ఇప్పటికి ఆమె రాసిన ఆ స్క్రిప్టు కోసం ఎగబడటం ఆసక్తికరం.

వివరాల్లోకి వెళితే...మార్లిన్ మన్రో రచించిన చివరి స్ర్కిప్టు 'సమ్‌థింగ్స్‌ గాట్‌ టు గివ్‌' వేలానికి వస్తోంది. ఈ స్ర్కిప్టుతోనే తన చివరి సినిమా చేస్తూ, అది పూర్తికాకముందే ఆమె మరణించింది. ఈ స్ర్కిప్టు కనీస వేలం ధర 20 వేల అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు.

149 పేజీల ఈ స్ర్కీన్ ప్లే పుస్తకం కొద్దిగా చినిగినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. 1962లో కేవలం 36 సంవత్సరాల వయసులో మన్రో మృతి చెందింది. ఈ స్ర్కిప్టులో తన కేరక్టర్‌ గురించిన అంశాలు, డైలాగ్‌ డైరెక్షన్స్ పై 42 పేజీల్లో పెన్సిల్‌, గ్రీన్ పెన్‌‌‌‌‌తో ఆమె నోట్స్‌ కూడా రాసుకుంది.

డ్రగ్స్ మితిమీరి తీసుకుని..

డ్రగ్స్ మితిమీరి తీసుకుని..

ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్‌ నిర్మాణంలో ‘సమ్‌థింగ్స్‌ గాట్‌ టు గివ్‌' షూటింగ్‌ మొదలవడానికి ముందు 18 నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉంది మన్రో. షూటింగ్‌ మొదలయ్యాక సమయానికి రాకుండా ఆలస్యం చేస్తుండటంతో ఆమెపై నిర్మాతలు కోప్పడ్డారు కూడా. రెండు నెలల తర్వాత, వాళ్లతో ఒప్పందం కుదుర్చుకొని, రెగ్యులర్‌గా షూటింగ్‌కు రావడం ప్రారంభించింది, కానీ వారం తర్వాత అనూహ్యంగా.. శ్రుతిమించిన స్థాయిలో మత్తుమందులు తీసుకొని, తన అపార్ట్‌మెంట్‌లో చివరి శ్వాస విడిచింది మన్రో.

ఆమె ఎఫెక్ట్ అంతుంది..

ఆమె ఎఫెక్ట్ అంతుంది..

36 యేళ్ళు మాత్రమే జీవించిన మార్లిన్‌మన్రో నిద్రమాత్రలు మింగి చనిపోయిందన్న వార్త ప్రేక్షక ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేసింది. ఆ విషాద వార్త తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా ఇరవైనాలుగు మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారంటే, ఆమె ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది.

వాడుకుని లాభపడింది

వాడుకుని లాభపడింది

మార్లిన్ మన్రో వివాదాస్పద సినీ జీవితంలో పలువురు ప్రముఖుల పాత్ర ఉంది. కొందరిని ఆమె వాడుకుని లాభాలు పొందడానికి ప్రయత్నించిందంటారు. కొందరు ఆమెను వాడుకుని లాభపడ్డారని కూడా చెప్తారు ఈ పద్మవ్యూహంలోంచి ఎలా బైటపడాలో ఆమెకు తెలియకే ఆమె మరణించందారు విశ్లేషకులు.

సూసైడా..మర్డరా..

సూసైడా..మర్డరా..

మార్లిన్ మన్రో లోని ఆకర్షణ శక్తే ఆమెకు ప్లస్‌ పాయింట్ అనేది నిజం. అదే సమంయలో అదే ఆమెకు మైనస్‌ పాయింట్‌గా కూడా మారింది. అలాగే ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? సాధారణ మరణమా అన్నది ఇప్పటికీ మిస్టరీయే! అంతటి స్టార్ హీరోయిన్ అర్ధాంతర మరణం వెనుక కుట్రకోణం ఉందా? సన్ని హితులు పన్నిన కుట్రవల్ల ఆమె హతమైందా? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానం దొరక లేదు.

తెగ క్లిక్ అయ్యింది

తెగ క్లిక్ అయ్యింది

మార్లిన్ మన్రో ..టీనేజ్ రోజుల్లో మోడలింగ్‌ చేసేది. సినిమా వేషాలు వస్తున్న తొలిరోజుల్లో ఒక కేలండర్‌కు నగ్నంగా ఫోజిచ్చి సంచలనం సృష్టించింది. లక్షలాదిమంది ఆ కేలండర్‌కోసం ఎగబడ్డారు. ఇలాంటి ఫోజు ఎందు కిచ్చారని ఒక విలేకరి ప్రశ్నిస్తే, ‘‘ఏం చేయను ఆకలి అవసరం అలాంటిది.. నేను కుదరదంటే, నా వెనుక క్యూలో ఎంతోమంది ఉన్నారు'' అని సమాధాన మిచ్చింది.

ఏడవ యేటే శృంగార అనుభవం

ఏడవ యేటే శృంగార అనుభవం

‘‘మీకు తొలి సెక్స్ అనుభవం ఎప్పుడు ఎదురైంది?'' అన్న ప్రశ్నకు ‘‘నా ఏడవ యేట'' అని చెప్పి విలేకరిని షాక్‌కి గురిచేసింది. ‘‘అతడు నా కంటే చిన్నవాడు'' అని చెప్పడంతో ఆ విలేకరి మరింత షాక్‌కు గురయ్యాడు!

ప్రొడ్యూసర్ ని పట్టుకుని పాపులర్

ప్రొడ్యూసర్ ని పట్టుకుని పాపులర్

తన కెరీర్ లో ఎదగటం కోసం, డబ్బు, కీర్తిప్రతిష్టలకోసం సినిమా అవకాశాల కోసం ఫలానా వ్యక్తి దోహదపడతాడని తెలిస్తే మార్లిన వారితో చనువుగా వ్యవహరించేదని హాలీవుడ్ మీడియా అంటుంది. తొలి రోజుల్లో అలా వేషాలు సంపాదించడానికి జానీ హైడ్‌ ఆమెకు ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ట్వంటీయత సెంచరీఫాక్స్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ జోసెఫ్‌ ఎమ్‌.షెంక్‌తో అనుబంధం పెంచుకుని పాపులర్‌ హీరోయిన్‌ హోదాకు చేరుకుంది.

ఇలా కెరీర్ లో ..

ఇలా కెరీర్ లో ..

మార్లిన్ మన్రో మొదటి చిత్రం ‘సమ్మర్‌ లైట్నింగ్‌' (1948). రెండవ చిత్రం ‘డేంజరస్‌ ఇయర్స్‌'. ఇవి అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే. ‘మంకీ బిజినెస్‌' ‘నయాగరా', ‘జెంటిల్‌మన్‌ ప్రెఫర్‌ బ్లాండిస్‌' వంటి చిత్రాలు ఆమెకు ‘సెక్సీస్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టాయి.‘బస్‌స్టాప్‌', ‘ద ప్రిన్స్‌ అండ్‌ ద షో గర్ల్‌', ‘సమ్‌లైక్‌ ఇట్‌ హాట్‌' వంటి చిత్రాలు ఆమెకు మరింత పేరు తెచ్చాయి.

సొంతంగా నిర్మాతగా..

సొంతంగా నిర్మాతగా..

సొంతంగా మార్లిన్‌ మన్రో ప్రొడక్షన్స్‌ స్థాపిం చింది. వార్నర్‌ బ్రదర్స్‌తో కలిసి ప్రసిద్ధ నటుడు లారెన్స్‌ ఒలివర్‌ దర్శకత్వంలో ఆయన సరసన ‘ద ప్రిన్స్‌ అండ్‌ ద షో గర్ల్‌' (1957లో) హీరోయిన్ గా ఓ చిత్రం నిర్మించింది కూడా! ఆమె నటించిన ‘సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌' చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది.

వరస పెళ్లిళ్లు..

వరస పెళ్లిళ్లు..

మార్లిన్‌ పదహారవయేట, 1942లో జూన్‌ 18వ తేదీన జిమ్‌ డఫర్టీ అనే నేవీ యువకుణ్ణి పెళ్ళాడింది. తొలి వివాహం మూడున్నరేళ్ళకే ముగి సింది. 1954లో ప్రసిద్ధ బేస్‌బాల్‌ క్రీడా కారుడు జో డిగియోని పెళ్ళిచేసుకుంది. తర్వాత ప్రసిద్ధ రచయిత ఆర్థర్‌మిల్లర్‌ మూడవ భర్తగా ప్రవే శించాడు. చదువులేని మార్లిన్‌మన్రో ఈ పెళ్ళితో మేధావి హోదా పొందే ప్రయత్నం చేసిందనీ, సెక్సీతారను చేసుకుని మిల్లర్‌ కూడా తన అహం సంతృప్తిపరుచుకున్నాడనీ వ్యంగ్యంగా చెప్పుకునేవారట.

 స్ర్కిజోఫీనియా

స్ర్కిజోఫీనియా

ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినా, అనిర్వచ నీయమైన భయం, అభద్రతాభావం మార్లిన్ మన్రోను వెంటా డేవని ఆమె సన్నిహితులనేవారు. ఎప్పుడూ అభద్రతా భావమే. నిర్ణయాలు తీసుకోవాలంటే కలవరపడేది. స్థిమితం లేకుండా ప్రవర్తించేది. జీవిత వాస్తవాలు చూసి భయపడేది. మానసికంగా ఆందోళనకు గురయ్యేది. అవన్నీ స్ర్కిజోఫీనియా లక్షణాలే. ఆమెకు నిద్ర పట్టేది కాదు. డాక్టరు సలహాతో నిద్రమాత్రలకు అలవాటు పడింది.

నిప్పుతో చెలగాటం

నిప్పుతో చెలగాటం

ప్రసిద్ధ నటుడు మార్లన్‌ బ్రాండోను ఆమె అభిమానించింది. ఆయనతో ‘గైస్‌ అండ్‌ డాల్స్‌'లో నటించేందుకు విఫల యత్నం చేసింది. చివరకు అతనితో సాంగత్యం ఏర్పరచుకునేవరకు ఆమె విశ్రమించలేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఆమెను వెన్నంటి ఉండేది. ఆమె పొందుకోరేవాళ్ళ నేపథ్యం చూసినప్పుడు ‘మార్లిన్‌ నిప్పుతో చెల గాటం ఆడుతోంది' అని చిత్ర పరిశ్రమలో అందరూ చర్చించుకునేవారు.

బరువు పెరిగిపోయింది

బరువు పెరిగిపోయింది

అశాంతి, సంక్షోభాలు మార్లిన్‌ సినీ జీవితంపై ప్రభావం చూపించాయి. షూటింగ్స్‌లో డైలాగులు మరిచిపోయేది. కెమెరా ధ్యాస ఉండేది కాదు. ముఖ్యమైన సన్నివేశాల్లో యాభై లేదా అంతకంటే ఎక్కువ టేకులు తీసుకునేది. గంటలతర బడి సహనటులు ఆమెకోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఆల్కహాల్‌, ట్రాంక్విలైజర్ల వాడకం వల్ల బరువు పెరిగిపోయేది మార్లిన్‌.

దావా వేసారు

దావా వేసారు

జోషువా లోగన్‌ (బస్‌స్టాప్‌), బిల్లీవైల్డర్‌ (సమ్‌లైకిట్‌ హాట్‌), జాన్‌ హూస్టన్‌ (విస్‌ఫిల్స్‌) వంటి ప్రసిద్ధుల చిత్రాల్లో నటించే అవకాశం ఆమెకు లభించింది. పదిహేనేళ్ళ సినీ జీవితంలో ఆమె నటించిన చిత్రాలు ముఫ్ఫై దాటలేదు. ఆమె చివరి చిత్రం ‘మిస్‌ ఫిట్స్‌ (1961). ఆ తర్వాత డీన్‌మార్టిన్‌కు జంటగా ‘సమ్‌థింగ్‌ గాట్‌ టు గివ్‌' చిత్రాన్ని పూర్తిచేయలేకపోయింది. దాంతో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించిందంటూ ట్వంటీ యత సెంచరీ ఫాక్స్‌ వారు ఆమెపై దావా వేశారు.

గాయాలు ఉన్నాయి

గాయాలు ఉన్నాయి

1962 ఆగస్టు 5వ తేదీ న అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మార్లిన్‌ మన్రో ఆత్యహత్య చేసుకుందన్న వార్త వెలువడింది. ఆమె పడకగదిలో నిద్రమాత్రల సీసా ఉందన్నారు. అయితే, ‘ఆమె శరీరంపై గాయాల గుర్తులు కూడా ఉన్నాయి, అది హత్యే, ఆధారాలు లేకుండా చేసేశారు, దీని వెనుక పెద్ద కుట్ర జరిగింది' అని నేటికీ కొందరు వాదిస్తూ ఉంటారు.

రెట్టింపు మొత్తం

రెట్టింపు మొత్తం

మార్లి న్‌ మన్రో ఉపయోగిం చిన వైట్‌ డ్రెస్‌ ఎంత ప్రఖ్యాతి చెందిందో చెప్పనక్కర్లేదు. ఈ గౌను ను ప్రొఫైల్స్‌ ఇన్‌ హిస్టరీ సంస్థ వేలం వేసింది. 4.6 మిలియన్‌ డాలర్లకు అది అమ్ము డుపోయింది. 1955 క్లాసిక్‌ సినిమా ‘ది సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌'లో మన్రో దీన్ని ధరించింది. వేలంలో అత్యధిక మొత్తానికి విక్రయమైన దుస్తుల్లో ఇది కూడా ఒకటి. హాలీవుడ్‌ నటుడు డెబ్బీ రెనాల్డ్‌‌స ప్రయివేట్‌ కలెక్షన్‌లో ఇది ఉండింది. దీని వేలం ద్వారా కనీసం 2 మిలియన్‌ డాలర్లు రాగలవని భావిస్తే అంతకు రెట్టింపు మొత్తం వచ్చింది.

English summary
Marilyn Monroe’s annotated scripts from her last movie are to be auctioned. The tragic star was fired from never-finished comedy “Something’s Got to Give” for being persistently disruptive on set — and she died two months later.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu