మార్లిన్ మన్రో...బ్రా, ఇతర వస్తువులు వేలం
లండన్: మార్లిన్ మన్రో..ప్రపంచ ప్రఖ్యాత సెక్సీతార. హాలీవుడ్ లో మార్లిన్ మన్రో కలిగించినంత సంచలనం మరే తారామణీ కలిగించలేదు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మార్లిన్ పేరెత్తితే చాలు వెర్రెత్తిపోయేవారు. ఆమె పదేళ్ళలో పదకొండు సినిమాలలో మాత్రమే నటించారు. కానీ సినిమా ప్రపచంలో చెరగని ముద్ర వేసింది. న్యూయార్క్ వార్తా పత్రికల్లో ఆ రోజుల్లో ఆమె ఫోటో, రచన, గుసగుసలు, ముఖాముఖి లేకుండా ఉండేవి కావంటే అతిశయోక్తి కాదేమో.
మర్లిన్ మన్రో తన 36వ యేట - నిద్రమాత్రలు అధిక సంఖ్యలో మ్రింగడం వల్ల చనిపోతే (ఆగస్టు6,1962) అది హత్యా, ఆత్మహత్యా అనే విషయం పై ఇప్పటికీ తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె మరణ వార్త విని తప్పుకోలేక ప్రపంచ వ్యాప్తంగా 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ అడపాదడపా ఆమె ధరించిన దుస్తులు, వాడిన వస్తువుల్లాటివి వేలం వేస్తే, లక్షల డాలర్లలో శ్రీమంతులు సొంతం చేసుకుంటూనే ఉన్నారు.

తాజాగా మార్లిన్ మన్రోకు సంబంధించిన మరికొన్ని వస్తువులు వేలానికి పెట్టారు. ఆమెకు సంబంధించిన లవ్ లెటర్స్, ఆమె ధరించిన బ్రా, కోటు మరికొన్ని వస్తువులు వేలం వేసారు. ఇందులో ఆమెకు సంబంధించిన సిల్క్ ఓవర్ కోట్ 1,75,00 డాలర్లకు వేలం వేసారు.
ఆమెకు సంబంధించిన బ్లాక్ కాక్ టెయిల్ డ్రెస్, ఓపెరా కోట్ 93,750 డాలర్లకు, వైట్ కలర్ బ్రా 20,000 డాలర్లకు, స్మాల్ లిప్ బ్రష్ 10,000 డాలర్లకు, మేకప్ కాంపాక్ట్ 46,875 డాలర్లకు వేలం వేసారు.



Click it and Unblock the Notifications











