twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనావైరస్‌తో హాలీవుడ్ నటుడు మృతి.. న్యూయార్క్‌లో వైరస్ కలకలం..

    |

    ప్రాణాంతక కరోనావైరస్‌తో నటుడు మార్క్ బ్లమ్ తుది శ్వాస విడిచాడు. కొద్దిరోజుల క్రితం నావెల్ కరోనావైరస్ సోకడంతో అస్వస్థతకు గురైన మార్క్ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. మార్క్ మరణాన్ని ఆయన భార్య జానెట్ జరీష్ ధృవీకరించారు. దాంతో మార్క్ మృతిపట్ల స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

    నావెల్ కరోనావైరస్‌తో బాధపడుతూ..

    నావెల్ కరోనావైరస్‌తో బాధపడుతూ..

    కొద్ది రోజులుగా నావెల్ కరోనావైరస్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో మార్చి 25వ తేదీన న్యూయార్క్ ప్రెస్బీటెరియన్ హాస్పిటల్‌లో మరణించారు అని మార్క్ బ్లమ్ భార్య జానెట్ మీడియాకు వెల్లడించారు.

    అత్యంత ప్రజాదరణతో ఆకట్టుకొన్న..

    అత్యంత ప్రజాదరణతో ఆకట్టుకొన్న..

    డెస్పెరేట్లీ సీకింగ్ సుసాన్, క్రోకడైల్ డుండీ చిత్రాలతో అత్యంత ప్రజాదరణ పొందారు. లవ్ సిక్, జస్ట్ బిట్వీన్ ఫ్రెండ్స్, బ్లైండ్ డేట్, ది ప్రెసిడియో అనే చిత్రాల్లో నటించారు. ఇక ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన యూ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. లాస్ట్ ఇన్ యాంకర్స్, ది బెస్ట్ మ్యాన్, ది అసెంబుల్డ్ పార్టీస్ అనే చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. అమెజాన్ సిరీస్ మోజార్ట్‌లో కూడా నటించారు.

    ప్రముఖుల సంతాపం..

    ప్రముఖుల సంతాపం..

    అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌లో కీలకంగా వ్యవహరించారు. మార్క్ మరణంపై ఈ సంఘాల నేత రెబెకా డామన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే మార్క్ మృతి వార్తతో సన్నిహితులు, స్నేహితులు, సహచర నటులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

    మార్క్ బ్లమ్‌ మరణం తీవ్ర విషాదం

    మార్క్ బ్లమ్‌ మరణం తీవ్ర విషాదం

    మార్క్ బ్లమ్‌ మరణం మాకు తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఇకలేరనే విషయాన్ని స్నేహితులకు చెప్పడానికి చాలా బాధగా ఉంది. కరోనావైరస్ వ్యాధి తీవ్రత కారణంగా, చికిత్స జరుగుతున్న సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా ఆయన మరణించారు. ఆయన లేని లేటు పూడ్చలేనిది అని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

    Recommended Video

    Nithiin’s Bheeshma Reaches Break-Even Mark in Just 5 Days
    న్యూయార్క్ సిటీలో దారుణంగా

    న్యూయార్క్ సిటీలో దారుణంగా

    అమెరికా వ్యాప్తంగా కరోనావైరస్ తీవ్రతరం అయింది. న్యూయార్క్ స్టేట్‌లో పరిస్థితి రోజురోజుకు విషమంగా మారుతున్నది. కేవలం న్యూయార్క్ సిటీలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నదని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే మార్క్ బ్లమ్ కూడా కరోనావైరస్ కాటుకు బలయ్యాడు. మార్క్ బ్లమ్ మరణం అమెరికాలో తీవ్రతకు అద్దం పడతున్నది.

    English summary
    Mark Blum died with Novel Coronavirus complications: AFTRA tweeted, It is with such deep sorrow that I’m writing to share the news that our friend and former board member Mark Blum has passed away as a result of complications from the coronavirus. Mark was a dedicated Screen Actors Guild and SAG-AFTRA board member serving from 2007-2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X