లైంగిక వేధింపులు ఉండేవి... ఆయన ‘పవర్‌ఫుల్’ స్టార్... ‘ప్రొటెక్షన్’ కోసమే పెళ్లి!

టాప్ క్రూయిజ్ పేరు వింటే... హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలు గుర్తుకు వస్తాయి. తాజాగా టామ్ క్రూయిజ్ గురించి మాజీ భార్య నికోల్ కిడ్మన్ ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1990లో పెళ్లాడిన ఈ జంట 11 ఏళ్ల కాపురం తర్వాత విడిపోయారు.

విడిపోయిన తర్వాత తన మాజీ భర్త గురించి ఎక్కడా ప్రస్తావించని నికోల్ కిడ్మన్ న్యూయార్క్ మేగజైన్ ఇంటర్వ్యూలో చాలా కొత్త విషయాలు చెప్పారు. అతడిని పెళ్లి చేసుకోవడానికి మా ప్రేమ మాత్రమే కాదు... నా స్వార్థం కూడా ఉంది అని తెలిపారు.

 అలా పరిచయం

అలా పరిచయం

22 ఏళ్ల వయసులోనే టామ్‌తో నా పెళ్లి జరిగింది. డేస్ ఆఫ్ థండర్ సినిమా సమయంలో టామ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది... అని నికోల్ కిడ్మన్ గుర్తు చేసుకున్నారు.

 పవర్ కోసం కాదు ప్రొటెక్షన్ కోసమే పెళ్లి

పవర్ కోసం కాదు ప్రొటెక్షన్ కోసమే పెళ్లి

ఆ సమయంలో ఇతరుల నుంచి లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు ఎదురవ్వడం కూడా నన్ను పెళ్లి వైపు నడిపించాయి. అప్పటికే టాప్ క్రూయిజ్ పవర్ ఫుల్ స్టార్. ఆయన్ను పెళ్లాడితే పవర్ వస్తుందనే ఆలోచన లేదు కానీ, హరాస్మెంట్స్ నుండి రక్షణ లభిస్తుందనే ఆలోచన అయితే ఉండేది... అని నికోల్ గుర్తు చేసుకున్నారు.

నన్ను చాలా బాగా చూసుకున్నాడు

నన్ను చాలా బాగా చూసుకున్నాడు

పెళ్లి తర్వాత టాప్ క్రూయిజ్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నా స్నేహితుల్లో చాలా మంది గృహ హింస బాధితులు ఉన్నారు. కానీ నాకు టాప్ వల్ల అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదని నికోల్ కిడ్మన్ తెలిపారు.

ఆయన గురించి ఇపుడు మాట్లాడలేను

ఆయన గురించి ఇపుడు మాట్లాడలేను

ప్రస్తుతం తాను వేరొకరి భార్య అవ్వడం వల్ల తన మాజీ భర్త టాప్ క్రూయిజ్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి నికోల్ కిడ్మన్ ఇష్టపడలేదు. టామ్‌తో విడిపోయిన తర్వాత నికోల్ కంట్రీ సింగర్ కీత్‌ అర్బన్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X