Guardians of the Galaxy 3 Twitter Review: ఫన్ అండ్ ఎమోషనల్‌గా మార్వెల్ కొత్త సినిమా.. ఆకట్టుకుందా అంటే?

అతిపెద్ద సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్ చిత్రాలకు వరల్డ్ వైడ్ గా ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. తన చిత్రాలతో ప్రపంచ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న మార్వెల్ సంస్థ ఒక్కో సినిమా రిలీజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. ఇటీవల యాంట్ మ్యాన్ సిరీసులో మూడో మూవీ 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా' విడుదల కాగా ఇప్పుడు తాజాగా 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' ఫ్రాంచైజీలోని మూడో సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3' (Guardians of the Galaxy Vol. 3) మూవీపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో చూద్దాం.

భారీ అంచనాలు:ప్రపంచస్థాయిలో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో 32వ చిత్రంగా వస్తోంది 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3'. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికీ 2014లో మొదటి సినిమా, 2017లో రెండో చాప్టర్ వచ్చి ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టున్నాయి. ఇప్పుడు వచ్చే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Marvel Cinematic Universe Guardians of the Galaxy Vol. 3 Twitter Review

జేమ్స్ గన్ డైరెక్షన్:గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 సినిమాలో క్రిస్ ప్రాట్, జో సల్దానా, బ్రాడ్లీ కూపర్, విన్ డిజిల్ (గ్రూట్ క్యారెక్టర్ కు వాయిస్), కారెన్ గిల్లాన్, డేవ్ బాటిస్టా, పామ్ క్లెమెంటీఫ్, విల్ పౌల్టర్ తదితరులు నటించగా.. జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. కెవీన్ ఫీజ్ నిర్మాతగా, నికొలాస్ కోర్డా, సారా స్మీత్, సైమన్ హాట్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు.

Marvel Cinematic Universe Guardians of the Galaxy Vol. 3 Twitter Review

నిరాశపరుస్తున్న మార్వెల్:ఇటీవల మార్వెల్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న సమయంలో భారీ అంచనాలతో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 వచ్చింది. మరి మే 5న విడుదల కానున్న ఈ సినిమాకు నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

ఎమోషనల్ గా:"సూపర్ హీరో ట్రయాలజీలో అన్నిటికంటే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ట్రయాలజీ బెస్ట్. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ఎమోషనల్ గా మీ గుండెలు బరువెక్కేలా చేస్తుంది. ఆద్యంతం ఆకట్టుకునే ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా కన్విన్సింగ్ గా ముగుస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ" అని ఒక నెటిజన్ రాసుకొచ్చారు.

పిడికిలి బిగబట్టేలా:"మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో స్పైడర్ మ్యాన్ తప్పా నేను ఎండ్ గేమ్ వంటి చిత్రాలు ఏవి పెద్దగా చూడలేదు. కానీ, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 మాత్రం అద్భుతమైన చిత్రం. నవ్వులు, కన్నీళ్లతో నిండిపోయింది. నేను దారుణంగా ఏడ్చాను. పిడికిలి బిగబట్టేంతలా లీనమైపోయాను. ఎక్సలెంట్ మూవీ" అని ఒకరు తన అభిప్రాయం పంచుకున్నారు.

దానికి నిర్వచనం:"గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 కొత్త చిత్రాన్ని ఇప్పుడే చూశాను. నాకు తెలిసి ఈ సినిమాకు ఏడ్చినంతగా నేను ఏ మూవీకి ఏడవలేదు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనే పదానికి అద్భుతమైన నిర్వచనం. ఓవైపు ఆనందబాష్పాలు, మరోవైపు బాధకరమైన కన్నీళ్లతో కలగలిపిన సినిమా. వంద శాతం కచ్చితంగా చూడాల్సిన సినిమా" అని మరొకరు రాసుకొచ్చారు.

కన్నీళ్లు ఆగలేదు:"గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా ఎమోషనల్, డార్క్ గా ఉందో.. అలాగే అందులోని అంశాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. అన్నిటికి మించి ఇది ఒక ఆశ్చర్యకరంగా సంతోషాన్నిచ్చే సినిమా. నేను పూర్తిగా ఆస్వాదించాను. మార్వెల్ సంస్థ బాధను పోగొట్టి, మంచి చిత్రంగా నిలిచిపోతుంది" అని ఒక నెటిజన్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3పై తన భావాలను తెలిపారు. "నాకు కన్నీళ్లు ఆగలేదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే సరిగా లేదు. కానీ మిగతా అంతా బాగుంది. బ్యూటిఫుల్, బ్రేవ్ కచ్చితంగా పర్ఫెక్ట్" అని మరొకరు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X