The Marvel సిల్వర్ స్క్రీన్‌పై మార్వెల్ స్టూడియో మ్యాజిక్.. ఐమాక్స్ వెర్షన్ లుక్ ఎలా ఉందంటే?

మార్వెల్ సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలో మార్వెల్ సిరీస్‌కు విశేషంగా ఆదరణ ఉందనే విషయం మార్వెల్ స్డూడియో నిర్మించిన సినిమాల కలెక్షన్లు నిరూపించాయి. మార్వెల్ స్టూడియో సినిమాలకు ఇండియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటి మార్వెల్ స్టూడియో బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం మార్వెల్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌, వీడియోను రిలీజ్ చేసి అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..

మార్వెల్స్ సినిమా విషయానికి వస్తే.. బ్రై లార్సన్, తేనో ప్యారిస్, ఇమాన్ వెల్లానీ, జావే ఆష్టన్, గ్యారీ లెవీస్, సీ జంక్ పార్క్, జెనోబియా ష్రాఫ్, మోహన్ కపూర్, సాగర్ షేక్, శామ్యూల్ ఎల్ జాక్సన్ తదితరులు నటించారు. నియా డకోస్టా దర్శకత్వం వహించగా, కెవిన్ ఫీజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు నియా డాకోస్టా, మెగన్ మెక్‌డానెల్, ఎలిసా కరాసిక్ స్క్రీన్ ప్లేను అందించారు.

Marvel Studio releases Imax version of The Marvels movie Look

మార్వెల్స్ మూవీ సినిమాకు సంబంధించిన ఐమాక్స్ వెర్షన్ లుక్‌ను రిలీజ్ చేస్తూ.. ఈ సినిమాను ఐమాక్స్ వెర్షన్‌లో ఎంజాయ్ చేయండి. దాదాపు 30 నిమిషాలపాటు ఐమాక్స్ వెర్షన్‌లో సన్నివేశాలను సెలక్టివ్‌గా చిత్రీకరించాం. ఆ సన్నివేశాలు తెరమీద అద్బుతంగా మంచి ఫీల్‌ను కలిగించడమే కాకుండా మంచి అనుభూతిని కలుగు చేస్తాయి. ఈ సినిమాకు ఐమాక్స్ నెక్ట్స్ జనరేషన్ సౌండ్‌ను జోడించాం. ఇలాంటి అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి అని మార్వెల్ స్టూడియో ప్రకటనలో తెలిపింది.

Marvel Studio releases Imax version of The Marvels movie Look

ది మార్వెల్స్ మూవీలో కరోల్ డన్వేర్ అలియాస్ కెప్టెన్ మార్వెల్ తన ఐడెంటినీ టెరెన్నియల్ క్రీ ద్వారా తెలుసుకొని సుప్రీం ఇంటెలిజెన్స్‌పై ప్రతీకారం తీర్చుకొంటారు. ఈ ప్రతీకారం తీర్చుకొనే క్రమంలో యూనివర్స్‌లో ఎదురైన సమస్యలు, అడ్డంకులను ఎలా అధిగమించారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. జెర్సీ సూపర్ ఫ్యాన్ కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్, సాబెర్, ఆస్ట్రోనాట్ కెప్టెన్ మోనికా రాంబీ పాత్రలు విశేషంగా ఆకట్టుకొంటాయని మార్వెల్ తన ప్రకటనలో తెలిపింది.

మార్వెల్ స్టూడియో నుంచి వస్తున్న సినిమాకు భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి అంచనాలకు అనుగుణంగానే ది మార్వెల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను దీవాళీ కానుకగా ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామన మార్వెల్ స్టూడియో ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X