Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సెక్స్ చేస్తుండగా గుండెపోటుతో మృతి.. ప్రముఖ నటుడి జీవితంలో అలా విషాదం
హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత మ్యాథ్యూ మెక్ కనాగే తన జీవితంలో ఎదురైన భావోద్వేగాలకు పుస్తక రూపం ఇచ్చారు. తన జీవితంలో అనుభవించిన కష్ట సుఖాలను తన అభిమానులతో పంచుకోవడానికి గ్రీన్ లైట్స్ అనే పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చారు. ఈ పుస్తకాన్ని అక్టోబర్ 20వ తేదీన ఆవిష్కరించారు. తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ పుస్తకంలో వెల్లడించిన సంచలన విషయాలు ఏమిటంటే..
మ్యాథ్యూ మెక్ కనాగే కెరీర్ ఇలా..
హాలీవుడ్ నటుడిగా మ్యాథ్యూ మెక్ కనాగే పలు రొమాంటిక్, కామెడీ చిత్రాలతో అలరించారు. ఆయన నటించిన ది వెడ్డింగ్ ప్లానర్, హౌటూ లూస్ ఏ గయ్ ఇన్ 10 డేస్, ఫెయిల్యూర్ టు లాంచ్, ఫూల్స్ గోల్డ్, ఘోస్ట్ ఆఫ్ గర్లఫ్రెండ్స్ పాస్ట్ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ది లింకన్ లాయర్, బెర్నీ, మ్యాజిక్ మైక్, ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, కిల్లర్ జో చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
మ్యాథ్యూ మెక్ కనాగే తన జీవిత చరిత్రలో
తాజాగా తన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను గ్రీన్లైట్స్ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకంలో తన తండ్రి మరణం గురించి ప్రత్యేకంగా పొందుపరిచారు. తన తండ్రి అనూహ్య పరిస్థితుల్లో మరణించడం జీవితంలో పెను విషాదాన్ని నింపింది. తన తల్లితో తండ్రి సెక్స్ చేస్తుండగా మరణించారు అని ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తండ్రి మరణాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగం
తన తండ్రి మరణాన్ని నటుడు మ్యాథ్యూ మెక్ కనాగే గుర్తు చేసుకొంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఓ రోజు నా తల్లి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మీ నాన్న చనిపోయాడు అంటూ ఫోన్లో కన్నీరుమున్నీరయ్యారు. దాంతో నా కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది. నా తల్లి చెప్పిన వార్తను నమ్మలేకపోయాను అని మ్యాథ్యూ మెక్ కనాగే తెలిపారు.
చివరి శ్వాస వరకు నా తల్లి ప్రేమలో
నాకు, నా సోదరులకు మా నాన్న పదే పదే ఓ మాట చెప్పేవారు. మీ తల్లితో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉండగానే నా తుదిశ్వాస ఆగిపోతుందనే అనేవారు. ఆయన చెప్పినట్టే.. నా తల్లితో సెక్స్ చేస్తుండగా హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడు. పడక గదిలోనే ఆయన నా తల్లి పక్కనే విగత జీవిగా మారిపోయాడు అని మ్యాథ్యూ మెక్ కనాగే పేర్కొన్నారు.
Recommended Video
నా తల్లిదండ్రుల జీవితం ప్రత్యేకమైనది
మా అమ్మా, నాన్నలది జీవితం చాలా ప్రత్యేకమైనది. చాలా ఏళ్లపాటు విడిపోవడం, మళ్లీ ప్రేమించుకోవడం చేస్తూనే ఉన్నారు. ఒకసారి డైవోర్సో తీసుకొన్న తర్వాత మళ్లీ విభేదాలు పరిష్కరించుకొని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఏదో గొడవలు వచ్చి మళ్లీ విడిపోవడం లాంటివి వారి జీవితాల్లో జరిగాయి. అలా వారి జీవితంలో మూడుసార్లు విడిపోవడం, మూడుసార్లు పెళ్లి చేసుకోవడం జరిగాయి అని మ్యాథ్యూ మెక్ కనాగే తెలిపారు.