హాలీవుడ్ నటుడు జేమ్స్ గార్నర్ మృతి
హైదరాబాద్: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జేమ్స్ గార్నర్(86) అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో కన్ను మూశారు. ఆయన నటించిన చిత్రాల్లో 'ది రాక్‌ఫోర్డ్ ఫైల్స్', 'ది నోట్ బుక్' సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. 'మర్పీస్ రోమాన్స్' చిత్రానికి ఆస్కార్ అవార్డు, రాక్‌ఫోర్డ్ ఫైల్స్, మావవెరిక్ వంటి ప్రసిద్ధి చెందిన టివి షోలకు నేతృత్వం వహించారు.
లాస్‌ఏంజిల్స్ నగరం బ్రెంట్‌హుడ్ ప్రాంతంలోని ఆయన సొంతింట్లో అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు కన్నుమూశారని స్థానిక పోలీసులు తెలిపారు. ఆయన మృతి గురించి సోమవారం తెల్లవారుజామున సమాచారం ఇచ్చారని లాస్ ఏంజిల్స్ పోలీస్ ఆఫీసర్ ఆలోంజో లింక్విజ్ తెలిపారు.

80వ జన్మ దినోత్సవ వేడుకలు జరుపుకున్న జేమ్స్ గార్నర్, 2008 మేలో గుండెపోటుతో అనారోగ్యం పాలయ్యారు. అయితే ఆయన మృతికి కారణాలు ఇంకా తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. 2005లో ఆయన లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు, తదితర అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











