అక్కడున్న టాటూని తీసివేసేందుకు సిద్దం: మేఘన్ ఫాక్స్
అతిసామాన్యంగా కెరీర్ ను ఫ్రారంభించి ఒక్క సినిమాతో స్టార్ డమ్ ను సంపాదించిన హీరోయిన్ మేగన్ ఫాక్స్. మేగన్ ఫాక్స్ హాలీవుడ్ అందగత్తె మాత్రమే కాదు తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్రాన్స్ ఫార్మర్స్ అనే సినిమాతో హీరోయిన్ గా అందరి గుండెల్లో చెరగని స్దానం సంపాదించుకుంది. ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాకిగాను ఎన్నో అవార్డులను సోంతం చేసుకుంది. తర్వాత రోజుల్లో మేగన్ ఫాక్స్ సెక్స్ సింబల్ గా మెన్స్ మ్యాగజైన్ లో దర్శనమిచ్చింది.
వరుసగా నాలుగు సార్లు హాట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. దానితో పాటు 2008లో సెక్సీయస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అవార్డుని కైవసం చేసుకుంది. 2004లో బ్రైన్ ఆస్టన్ గ్రీన్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టి జూన్ 2010లో పెళ్సి చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా మేగన్ ఫాక్స్‌ని అభిమానులు అందరూ ముద్దుగా జూనియర్ ఏంజిలీనా జోలీగా అభివర్ణిస్తారు. 25 సంవత్సరాల వయసు కలిగిన మేగన్ ఫాక్స్ తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోని తన కుడి చేతిపై టాటూగా వేయించుకోవడం జరిగింది.
ఐతే ఇప్పుడు మేగన్ ఫాక్స్ తన కుడి చేతిపై ఉన్న మార్లిన్ మన్రో టాటూని తీసివేయించుకోవాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. దీనికి గల కారణం తన శరీరంపై ఉన్న మార్లిన్ మన్రో టాటూ వల్ల నెగిటివ్ ఎనర్జీని సొంతం చేసుకొవాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకొవడం జరిగిందని మేగన్ ఫాక్స్ తెలిపింది. గతంలో మేఘన్ ఫాక్స్ ఎవరితో పడితే వారితో సెక్స్‌లో పాల్గోంటోంది అనే వదంతులు రావడంతో నేనింత వరకూ నా చిన్న నాటి మిత్రుడు, ఇప్పటి బాయ్ ఫ్రెండ్ బ్రియాన్ అస్టిన్ గ్రీన్ లతో మాత్రమే సెక్స్ లో పాల్గొన్నాను. నాకు నచ్చిన వారితోనే నేను అలా సన్నిహితంగా వుండగలను. నాకు నచ్చని వారితో అలా రాసుకుపూసుకోవడం నాకు నచ్చదు అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











