కూతురిని ఆకాశానికి ఎత్తేస్తున్న తండ్రి....!!
ప్రముఖ హాలీవుడ్ నటి, ఐక్యరాజ్యసమితికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏంజలీనా జోలీని ఆమె తండ్రి జాన్ వోయిట్ ఆకాశానికి ఎత్తేసాడు. అంతే కాదు తన ముద్దుల కూతురు ఏంజలీనాతో, మేఘన్ ఫాక్స్ ను పోల్చడాన్ని తప్పుబట్టాడు. ఇకనైనా ఆ పని చెయ్యండని అందరికీ మనవి చేసాడు. తన కూతురు ఏంజలీనా నుండీ కొన్నేళ్లుగా దూరంగా వుంటూ వస్తున్న జాన్ ఇటీవలే తన కూతురితో కలసిపోయాడు.
ఈ సంధర్భంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో పై విధంగా వ్యాఖ్యానించాడు. కాగా మేఘన్ ఫాక్స్ కు ఏందలీనా పోలికలు ఉండటం, జోలీలాగే మేఘనా కూడా టాటూల మీద మక్కువ చూపించడం, ఇటీవలే జోలీ మార్గంలో సమాజసేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లాంటివి చూసి అందరూ ఆమెను ఏందలీనా తో పోల్చుతున్నారు. ఈ విషయమై మాట్లాడిన జాన్ మేఘన్ ఫాక్స్ ప్రతిభ గల నటే అయినప్పటికీ ఏంజలీనాతో పోల్చదగ్గ నటికాదని, కానీ ఆమె జోలీ మార్గంలో నడుస్తే మంచిదని, ఎవరైనా ఎవరినైనా అనుసరించడంలో తప్పులేదని ఆయన స్పష్టం చేసాడు.


Click it and Unblock the Notifications











