అందంగా కనిపించాలంటే ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు అవసరం..!
మెల్ బి ఇంగ్లీష్ పాప్ సింగర్ మరియు స్పైసీ గర్ల్స్ లో ఒకరు. బ్రిటీష్ మీడియా మెల్ బి ఒక నిక్ నేమ్ పెట్టింది. అదేంటంటే స్కేరీ స్పైస్, ఇలా పెట్టాడానికి కారణం మెల్ బి ఎప్పుడూ ధరించే దుస్తులలో గాని, ఆమె ముఖం మీద చిరునవ్వు గాని ఎప్పుడు అలాగే ఉంటుంది. 2007 ఫిబ్రవరి లో మెల్ బి తన చిన్ననాటి స్నేహితుడు మరియు ఫిల్మ్ ప్రోడ్యూసరైనటువంటి స్టీఫెన్ బీలాఫోంట్ తో డేటింగ్ మొదలుపెట్టింది. అలా వారిద్దరి డేటింగ్ ఆరు నెలల తర్వాత పెళ్శికి దారితీసింది.
తనతో నాసహాజీవనం చాలా ఆనందంగా ఉందంటున్న మెల్ బి ఇటీవల కొన్ని తన మనసులోని మాటలను వివరించింది. నేను మరియు స్టీఫెన్ బీలాఫోంట్ గత నాలుగు సంవత్సరాలుగా కలసి ధెరపీ క్లాసులకు వెళుతున్నామన్నారు. అంతేకాకుండా ఈ థెరపీ క్లాసులకు వెళ్శడం మూలాన ఆరోగ్యం చాలా వరకు బాగుందన్నారు.
ఇదిఇలా ఉంటే పోయిన ఆగస్టులో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని వార్తలు రావడం జరిగింది. దీనిపై స్పందించిన మెల్ బి మాట్లాడుతూ అలాంటిది ఏమి లేదని కోట్టి పారేసింది. ప్రస్తుతం మా బంధం చాలా దృఢంగా ఉందన్నారు. మీరు నమ్మిన నమ్మకపోయిన మేము ఇద్దరం కలిసే ఉన్నామని, వచ్చే సంవత్సరంలో మాకు పాపాయి పుట్టాలని ఇప్పుటినుండే ప్రణాళికలు వేసుకుంటున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











