»   » బిజీగా ఉన్నా.. అందుకే పిల్లల్ని కనే యోచన లేదు

బిజీగా ఉన్నా.. అందుకే పిల్లల్ని కనే యోచన లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ మాజీ స్పైస్ గర్ల్ మెల్ సి‌‌ ప్రస్తుతానికి పిల్లలను కనడంలో ఎటువంటి ఆసక్తిగానీ, టైమ్ గానీ లేవని హల్లో మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. ఈ సందర్బంలో మెల్ సి మాట్లాడుతూ మా కూతురు స్కేర్ లెట్‌తో నేను చాలా ఆనందంగా ఉన్నాను. తనతో గడుపుతుంటే నాకు అసలు టైమే తెలియడం లేదు. ప్రస్తుతం మా పాపకి రెండు సంవత్సరాలు వయసు. ప్రస్తుతానికి మరో బిడ్డ గురించి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవడం లేదు. అందుకు కారణం కొత్తగా చేస్తున్న ఆల్బమ్ 'ద సీ'లో బిజీగా ఉండడమేనని అన్నారు.

స్కేర్ లెట్‌కి ఇంకో తమ్ముడినో, చెల్లినో ఇవ్వాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం చేస్తున్న ఆల్బమ్ నన్ను కొన్ని సంవత్సరాలు బిజీగా ఉంచేలా ఉందని అన్నారు. స్వతహాగా ఇంగ్లీషు సింగర్ అయిన మెల్ సి‌ని ముద్దుగా అందరూ స్పోర్టీ స్పైసీ‌గా పిలుస్తుంటారు. 1999లో మెల్ సి విడుదల చేసిన మొట్టమొదటి స్టూడియో ఆల్బమ్ 'నార్తన్ స్టార్' తనకి ప్రపంచం వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా 'నార్తన్ స్టార్' ఆల్బమ్ విడుదలైన సంవత్సరం దాదాపు 4మిలియన్ కాపీలు అమ్ముడై రికార్డుని కూడా నెలకొల్పడం జరిగింది.

తనతో పాటు మరో నలుగురు స్పైస్ గర్ల్స్‌ని కలుపుకొని 2007వ సంవత్సరంలో 'ద రిటర్న్ ఆఫ్ ద స్పైస్ గర్ల్స్' పేరు మీద వరల్డ్ టూర్ చేయడం జరిగింది. ఈ టూర్ తర్వాత 2009 ఫిబ్రవరిలో తన మొదటి బిడ్డ స్కేర్ లెట్‌కి జన్మనివ్వడం జరిగింది.

English summary
Former Spice Girl Melanie Chisholm, who has a two-year-old daughter Scarlet, is not ready for more kids.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu