twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 'మెన్ ఇన్ బ్లాక్ 3'

    By Nageswara Rao
    |

    1100 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో మూడేళ్లపాటు నిర్మాణం జరుపుకున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ధ్రిల్లర్ మెన్ ఇన్ బ్లాక్ - 3 సినిమా 3డి వర్సన్‌లో ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదవుతుంది. ఇండియాలో ఇంగ్లీషుతో పాటు తెలుగు, హిందీ బాషాలలో విడుదలవుతుండడం విశేషం.

    విల్ స్మిత్, టామీ లీ జోన్స్ లు 'ఏజెంట్ జె - ఏజెంట్ కె' లుగా నటించిన ఈ చిత్రానికి బేరీ సోనెన్ ఫెల్డ్ దర్శకత్వం వహించారు. ఈ 3డి ఫిక్షన్ లో యాక్షన్ తో పాటు కామెడీకి పెద్ద పీట వేశామని దర్శకులు తెలిపారు. 1969లో ఓ గ్రహాంతర ఉగ్రవాది.. అప్పటికి కుర్రాడైన ఏజెంట్ కెను హాత్య చేయండతోపాటు యావత్ మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదకరంగా మారతాడు. ఈ హాత్యను నివారించి ప్రపంచ మానవాళిని రక్షిచండానికి కాల యంత్రం సహాయంతో కొన్ని సంవత్సరాల వెనక్కి ప్రయాణం చేస్తాడు ఏజెంట్ జె(విల్ స్మిత్).

    ఈ క్రమంలో చోటు చేసుకునే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. భారతదేశమంతటా సోని పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మూడు భాషలలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ద్వారా పంపిణీ అవుతుంది. ఈ సందర్బంగా ఆ సంస్ద అధినేత మాట్లాడుతూ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తాయని అన్నారు. ఈ సినిమాను 3డిలో చూడడం ఓ గొప్ప అనుభూతినిస్తుందని అన్నారు.

    English summary
    The third "Men in Black" film is really happening. Reports say Columbia Pictures has given green light to "Men in Black 3" and announced a release date for the movie. The upcoming flick is now scheduled to arrive in the U.S. on May 25, 2012 and will be released in 3-D.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X