twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెన్ ఇన్ బ్లాక్-ఇంటర్నేషనల్: ఇండియన్ బాక్సాఫీసును ముంచెత్తనున్న హాలీవుడ్ మూవీ

    |

    సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన 'మెన్ ఇన్ బ్లాక్' మూవీ సిరీస్‌లో త్వరలో మరో చిత్రం రాబోతోంది. 'మెన్ ఇన్ బ్లాక్- ఇంటర్నేషనల్' పేరుతో రాబోతున్న తాజా చిత్రం జూన్ 14న ఇండియా వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    లియాన్ నీసన్ , క్రిస్ హెమ్స్ వర్త్, టెస్సా తాంసన్, రెబెక్కా ఫెర్గుసన్, కుమిలి నంజీయని, రఫ్ స్పెల్, లెస్ ట్విన్స్ ఎమ్మా తాంసన్ నటించిన ఈ చిత్రానికి 'ద ఫేట్ అఫ్ ద ఫ్యూరియస్' చిత్ర దర్శకుడు ఎఫ్ . గ్యారీ గ్రయ్ దర్శకత్వం వహించారు.

    Men In Black: International releasing on June 14

    దాదాపు 110 మిలియన్ డాలర్ల(రూ. 763 కోట్లు)తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాల్లో ఇదే లీస్ట్ బడ్జెట్ మూవీ. న్యూ యార్క్ సిటీ, మొరాక్కో, ఇటలీ మరియు లండన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఇండియా‌లో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

    'మెన్ ఇన్ బ్లాక్' సిరీస్‌లో తొలి చిత్రం జులై 2, 1997లో విడుదలైంది. అప్పట్లో 90 మిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందిన ఈ మూవీ 590 మిలియన్ డాలర్లు రాబట్టింది. 'మెన్ ఇన్ బ్లాక్ 2' 2002లో, 'మెన్ ఇన్ బ్లాక్ 3' 2012లో విడుదలై భారీ లాభాలు తెచ్చిపెట్టాయి.

    Men In Black: International releasing on June 14

    ఇంతకు ముందు వచ్చిన మూడు సిరీస్ చిత్రాలతో పోలిస్తే 'మెన్ ఇన్ బ్లాక్- ఇంటర్నేషనల్' తక్కు బడ్జెట్‌లోనే తెరకెక్కించారు. తొలి మూడు చిత్రాలకు బ్యారీ సొన్నెఫీల్డ్ దర్శకత్వం వహించగా... లేటెస్ట్ మూవీకి ఎఫ్ . గ్యారీ గ్రయ్ దర్శకత్వం వహించారు.

    English summary
    Men In Black: International releasing on June 14. Men in Black: International is an upcoming American science fiction action comedy film directed by F. Gary Gray and written by Art Marcum and Matt Holloway.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X