ముచ్చటగా మూడోసారి అవార్డుని సొంతం చేసుకున్నా..?
లాస్ ఏంజిల్స్: 84వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటి కేటిగిరిలలో కుర్ర తారలతో పోటీ పడి 62 యేళ్ల వయసు కలిగిన మెరిల్ స్టీప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో మెరిల్ స్టీప్ మాట్లాడుతూ నాకు మరోసారి ఆస్కార్ అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉంది. మెరిల్ స్టీఫ్‌కు ది ఐరన్ లేడి చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చడంతో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నారు.
అయితే మెరిల్ ఆస్కార్ అందుకోవడం ఇది తొలిసారి కాదు. ఈ ఆస్కార్ అవార్డు మెరిల్ స్టీప్‌కి మూడోసారి ఆస్కార్ అవార్డు. మూడోసారి ఆస్కార్‌ని సొంతం చేసుకున్నందుకు మెరిల్ స్ట్రీప్ చాలా సరదాగా మాట్లాడారు. ''నా పేరు ప్రకటించగానే, సగం అమెరికా 'మళ్లీ తనకేనా?' అని అన్నట్లు అనిపించింది. ఓ మై గాడ్... మరోసారి ఈ వేదికపై నిలుస్తానని ఊహించలేదు'' అన్నారు మెరిల్. మెరిల్ స్టీప్ ఆస్కార్ అవార్డ్ అందుకుంటున్న సమయంలో కొడాక్ ధియేటర్‌లో ఉన్న వారంతా గౌరవపూర్వకంగా నిలబడ్డారు.
మూడోసారి ఆస్కార్ రావడంతో పసిపిల్లలా ఎగిరి గంతేసానని.. చిన్న పిల్లలా మారి పోయానని.. స్ట్రీప్ తన సంతోషాన్ని విలేకరులతో పంచుకున్నారు. 30 ఏళ్ల క్రితమే రెండు ఆస్కార్‌లను స్ట్రీప్ సొంతం చేసుకుంది. 'ది ఐరన్ లేడి' చిత్రంలో మార్గరేట్ థాచర్ పాత్రను పోషించిన మెరిల్ స్ట్రీప్‌కు ఉత్తమ నటి కేటగిరిలో మూడో ఆస్కార్ వరించింది. బాఫ్టా అవార్డుల్లో కూడా స్ట్రీప్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











