twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    30 ఏళ్లుగా సినీ తారలపై మానభంగాలు.. సినీ నిర్మాత‌ దారుణాలు వెలుగులోకి ఇలా!

    |

    గత మూడు దశాబ్దాలుగా మహిళలపై హర్వే అకృత్యాలు నిరాటంకంగా సాగాయి. దాదాపు 80 మంది మహిళలు ఆయనపై ఫిర్యాదు చేశారు. న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, బెవెర్లీ హిల్స్, లండన్ తదితర నగరాల్లో పోలీసుల దర్యాప్తు చేశారు. మీటూ ఉద్యమం జోరందుకోవడంతో పలువురు బాధితులు ముందుకొచ్చి ధైర్యంగా కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బహిష్కరణ వేటు వేసింది. ప్రస్తుతం దీనిని వెయిన్‌స్టెయిన్ ఎఫెక్ట్ అంటూ పేర్కొంటున్నారు.

    తమపై లైంగిక దాడులంటూ..

    తమపై లైంగిక దాడులంటూ..

    2006లో తనపై లైంగిక దాడి చేశారంటూ మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హాలేయి నమోదు చేసిన కేసులోను, అలాగే 2013లో తనను రేప్ చేశారంటూ జెస్పికా మాన్ దాఖలు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు తీవ్రంగా స్పందించింది. పలు దఫాలు విచారించిన తర్వాత వెయిన్‌స్టెయిన్‌ను దోషిగా నిర్ధారించింది

    ప్రొడక్షన్ అసిస్టెంట్ ఆరోపణలతో

    ప్రొడక్షన్ అసిస్టెంట్ ఆరోపణలతో


    హార్వేపై దాఖలైన లైంగిక దాడులు, రేప్ కేసులన్నింటిపై 2020 ఫిబ్రవరి 24వ తేదీన కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. ఈ కేసులో హార్వే ప్రొడక్షన్ అసిస్టెంట్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది. న్యూయార్క్‌లో తనను రేప్ చేశాడనే ఆరోపణలపై థర్డ్ డిగ్రీ శిక్షను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కోర్టు వెలువరించిన తీర్పు హాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది.

    కేసు దర్యాప్తు ఇలా..

    కేసు దర్యాప్తు ఇలా..

    రేప్ కేసు దాఖలైన నేపథ్యంలో 2018 మే 15వ తేదీన హర్వే వెయిన్‌స్టెయిన్‌ను న్యూయార్క్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 జనవరి 6 తేదీన కేసు విచారణ మొదలైంది. లాస్ ఎంజెలెస్‌లో కూడా ఓ రేప్ కేసులో చార్ఝిషీట్‌ను దాఖలు చేశారు. దర్యాప్తు, సాక్షుల విచారణ అనంతరం ఫిబ్రవరి 24, 2020లో హార్వేను దోషిగా ప్రకటించారు. న్యూయార్క్‌లో నమోదైన మొత్తం ఐదు కేసుల్లో మూడింటిలో దోషిగా నిరూపించబడ్డారు.

    Recommended Video

    Payal Rajput About #Metoo Movement And Casting Couch || Filmibeat Telugu
    80 మంది మహిళలపై లైంగిక దాడి, రేప్

    80 మంది మహిళలపై లైంగిక దాడి, రేప్


    గత కొన్ని దశాబ్దాలుగా పలువురు ఔత్సాహిక తారలను వేషాలు, ఆఫర్ల పేరుతో మభ్యపెట్టి దారుణంగా హింసించారనే తీవ్రమైన ఆరోపణలు వెయిన్‌స్టెయిన్‌పై వచ్చాయి. ప్రముఖ హీరోయిన్లతోపాటు దాదాపు 80 మంది మహిళలను తమపై లైంగిక దాడి జరిపారని, అంతేకాకుండా రేప్‌ చేశారనే ఆరోపణలు చేయడంతో హాలీవుడ్‌లో ఈ కేసు సంచలనంగా మారింది.

    English summary
    Former Hollywood producer Harvey Weinstein has been sentenced to 23 years in prison. Judge James Burke announced the sentence for Harvey - 20 years for the criminal sex act and three years for rape. He was going to be sentenced to nine-29 years of prison for the charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X