దాడి కేసులో సింగర్‌పై అభిమాని కోర్టులో వ్యాజ్యం
లాస్ ఏంజిల్స్: మెక్సికన్ పాప్ సింగర్ 'గ్లోరియా ట్రేవి' పై ఆమె అభిమాని ఒకతను కేసు పెట్టాడు. వివరాల్లోకి వెళితే లాస్ ఏంజిల్స్‌లో కచేరీ నిర్వహిస్తున్న సమయంలో ఆమె భద్రతా సిబ్బంది అభిమానిపై దాడికి పాల్పడ్డారంటూ 'గ్లోరియా ట్రేవి' సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ అభిమాని పేరు ఎల్విస్ నవర్రో.
మే 11వ తారీఖున లాస్ ఏంజిల్స్‌లోని నోకియా థియేటర్లో ఈ సంఘటన జరిగినట్లు లాస్ ఏంజిల్స్ సుప్రీం కోర్టులో డాక్యుమెంట్స్ ఉన్నాయి. భద్రతా సిబ్బంది తనపై అనవసరంగా దాడి చేసినందుకు గాను నష్టపరిహారం క్రింద $1 మిలియన్లు చెల్లించాల్సిందిగా కోరాడు. ఎల్విస్ నవర్రో కథనం ప్రకారం 4,000 మంది అభిమానులు పాల్గోన్న ఈ కార్యక్రమంలో అందరూ చూస్తుండగా గ్లోరియా ట్రేవి బాడీ గార్డులు తనని కొట్టడమే కాకుండా బయటకు నెట్టి వేశారని అన్నాడు.
ఇలాంటి సన్నివేశం తన జీవితంలో ఎదుర్కోనలేదని అన్నాడు. అసలు ఈ గోడవ ఎలా మొదలైందో ఎల్విస్ నవర్రో మాత్రం వెల్లడించలేదు. ఎల్విస్ నవర్రో ఏరోజైతే కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడో అదే రోజు గ్లోరియా ట్రేవి లైవ్ ఆల్బమ్ 'గ్లోరియా ఈఎన్ వివో' ని అమెరికాలో అంగరంగ వైభవంగా విడుదల చేసింది. ఆల్బమ్ పాటలు అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











