బూరెల బుట్టలో పడ్డ స్టార్ డైరెక్టర్
ఎక్కువ బడ్జెట్ కలిగిన సినిమాలను రూపొంది బాక్సా ఫీసు రికార్డుల్ని నమోదు చేసిన దర్శకులలో ముందుండే స్టార్ దర్శకుడు మైఖేల్ బే. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మైఖేల్ బే 'తంతే బూరెల బుట్టలో పడ్డాడు' అనే సామెత మాదిరి హాలీవుడ్ ప్రఖ్యాత స్టూడియో పారామౌంట్ పిక్చర్స్‌లో రెండు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఒకటి 'పెయిన్ అండ్ గెయిన్' కాగా మరోకటి 'ట్రాన్స్‌ఫార్మర్స్ 4'. ఈ సందర్బంలో ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో బే మాట్లాడుతూ ఈ వసంతంలో పెయిన్ అండ్ గెయిన్ షూటింగ్ మొదలవుతుండగా.. 2014 వేసవిలో 'ట్రాన్స్‌ఫార్మర్స్ 4' సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాడు.
ప్లోరిడా ప్రాంతంలో జరిగిన యధార్ద కధ ఆధారంగా 'పెయిన్ అండ్ గెయిన్' సినిమాని రూపొందిస్తున్నట్లు తెలిపాడు. కధ విషయానికి వస్తే ప్లోరిడాలో ఉన్న బాడీ బిల్డర్స్ బృందం దోపిడీలు, హత్య ప్రచారం, కిడ్నాప్‌లు చేస్తూ అక్కడున్న ప్రజలను ఎలా భయబ్రాంతులను చేస్తున్నారో ముఖ్య కధాంశంగా సాగుతుంది. పెయిన్ అండ్ గెయిన్ సినిమాలో మార్క్ వాల్‌బెర్గ్, డ్వాన్ "రాక్" జాన్సన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ది రాక్, పెర్ల్ హార్బర్, బాడ్ బాయ్స్ మరియు ట్రాన్స్ఫార్మర్స్ లాంటి బాక్సాఫీసు సినిమాలకు మైఖేల్ బై దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











