Don't Miss!
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమ్మకానికి మైఖేల్ జాక్సన్ జుట్టు
సెలబ్రిటీలు ఏది చేసినా వార్తే. ఇక వారికి సంబంధించిన వస్తువులు అయితే కోట్లలో అమ్ముడుపోతాయి. ఈ సాంప్రదాయం మనకు సుపరిచయమే కానీ ఎప్పుడోకానీ ఇలాంటివి జరగవు. కానీ అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఇలాంటి వేలానికి మంచి స్పందన లభిస్తుంది. ప్రపంచం మొత్తం ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కు సంభందించిన వేలం ఒకటి తెరపైకి రాబోతోంది. ఇంతకు ముందు మైఖేల్ జాక్సన్ మరణ దృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) అమ్మకానికి వస్తే లక్షల్లో అమ్ముడుపోయి మైఖేల్ కు వున్న ప్రజాదరణను చాటిచెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఈ పాప్ స్టార్ జుట్టుని వేలం వెయ్యబోతున్నారు.
1984లో పెప్సీ కంపెనీకి సంభందించిన ఓ ప్రకటనలో నటిస్తుండగా మైఖేల్ జాక్సన్ ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మైఖేల్ జుట్టు మొత్తం కాలిపోయింది. ఆ తర్వాత ఆయన చనిపోయే వరకూ విగ్గు ధరించి నటించాడన్న సంగతి ఎరుకే. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ యాడ్ నిర్మాత రాల్ఫ్ కొహెన్ తన కోటుతో మైఖేల్ జుట్టుకు అంటుకున్న నిప్పును ఆర్పినప్పుడు ఆయన జుట్టును సేకరించాడట. ఇప్పుడా జుట్టును సదురు నిర్మాత అమ్మకానికి ఉంచబోతున్నాడట. దీంతో పాటు మైఖేల్ జాక్సన్ సంతకం చేసిన ఓ ఫోటోను కూడా వేలం గెలిచిన వారి సొంతం కానుంది. అక్టోబరు 17న లండన్ లోని ఎడ్వర్డియన్ ర్యాడిసన్ హోటల్ లో ఈ వేలం చోటు చేసుకోనుంది. ఈ పాప్ స్టార్ జుట్టు ఎంత రేటు పలకనుందో వేచి చూడాలి.