మైఖేల్ జాక్సన్ కేసు విచారణ పూర్తి.. డా. ముర్రే పై చర్యలు..??
ప్రముఖ పాప్ గాయకుడు దివంగత మైఖేల్ జాక్సన్ మృతి కేసు విచారణ పూర్తయింది. త్వరలోనే ఈ కేసు విచారణ వివరాలు లాస్ ఏంజిల్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకి అందజేయనున్నారని TMZ వెళ్లడించింది. గత సంవత్సరం జూన్ 25వ తేదీన మరణించిన పాప్ మాంత్రికుడు మైఖేల్ జాక్సన్ ది సహజ మరణమా లేక ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా హతమార్చారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ విచారణను పూర్తి చేసింది. ఇంకా ఈ వివరాలను అధికారికంగా వెళ్లడించకపోయినప్పటికీ మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత ఫిజీషియన్ డాక్టర్ ముర్రే పై న్యాయపరమయిన చర్యలు తీసుకునే అవకాశం వుందని విశ్వసనీయ కథనం.
ఈ నివేదికను లాస్ ఏంజిల్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకి ఎప్పుడు అందజేస్తారనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు. కానీ వీలయినంత త్వరలోనే ఈ నివేదిక పై డిస్ట్రిక్ట్ అటార్నీ విచారణ చేపట్టనుంది..!!


Click it and Unblock the Notifications











