మైఖేల్ జాక్సన్ ఆత్మ నిజంగానే కనిపించిందా..?? లేక అపోహా..!!
ప్రముఖ పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ గత ఏడాది జూన్ 25వ తేదీన తన అభిమానులను మొత్తం శోకసంద్రంలో ముంచేసి మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా అతని ప్రాభవం ఏ మాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే మైఖేల్ రిహార్సల్ డాక్యుమెంటరీని 'దిస్ ఈజ్ ఇట్' రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టడమే. మైఖేల్ మీదున్న మితిమీరిన అభిమానంతో చాలా మంది అభిమానులు మైఖేల్ జాక్సన్ ఆత్మ తమకు కనిపించిందని చెప్పిన దాఖలాలు కోకొల్లలు. ఇటీవలే అమెరికాలోని హాలీవుడ్ లో ఆకాశంలోని ఓ మేఘం మైఖేల్ జాక్సన్ ను పోలివుండటంతో అతనే తన అభిమానుల కోసం ఇలా వచ్చాడనే వార్తలు వినిపించాయి. అది యాదృచ్చికంగా అలా జరిగిందో లేక మరేంటో కానీ ఇలాంటి వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇప్పుడు జింబాంబ్వే లో ఇలాంటి ఓ సంఘటనే మరో సారి సంచలనం సృష్టించింది. జింబాంబ్వే దేశ రాజధాని హరారే నగరంలోని సెయింట్ మేరీ మిషన్ స్కూల్ లో సాయంత్ర సమయంలో 12 నుండీ 14 ఏళ్ల మధ్య వయసు వున్న కొంత మంది విధ్యార్థులు నన్ లతో కలిసి నాటకం ప్రదర్శిస్తుండగా హఠాత్తుగా లైట్లు ఆరిపోయి, ఆ తర్వాత తెల్లటి గ్లౌజులతో ఓ ఆకారం కనిపించి అందరి వైపు చూసి మందహాసం చేసి అదృశ్యం అయిందట. ఈ పరిణామంతో అక్కడ వున్న వారంతా అవాక్కయారంట. మైఖేల్ జాక్సన్ కనిపించాడు అని ఆనందాశ్చర్యాలలో వుండిపోయారంట. కానీ ఆత్మలు కనిపించడం లాంటివి అన్నీ అపోహలే అని, దీని వెనుక ఎవరో వున్నారని కొందరు అభిప్రాయపడుతుండగా, ఈ పాఠశాల విధ్యార్థులు మాత్రం మైఖేల్ ను చూసామనే ఆనందంలో ఈ వార్తలేవీ పట్టించుకోవడం లేదు..


Click it and Unblock the Notifications











