అయ్యబాబోయ్ అతని పాదరక్షలను అంత పెట్టి కొన్నారా..!!
పాప్ మాంత్రికుడు మైఖేల్ జాక్సన్ కు ప్రపంచం మొత్తం ఎంతో మంది అభిమానులు వున్నారు. ఆయన మరణించినా ఆయన పాటలు పాటలు మాత్రం నిత్యం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర్ లేదు. ఆయన అభిమానులు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన మీద వున్న అభిమానాన్ని చూపిస్తూ వుంటారు. మైఖేల్ కు సంబంధించిన ఏ వస్తువునైనా కోట్లు కుమ్మరించి తమ అభిమాన గాయకుడి వస్తువును తమ సొంతం చేసుకోవాలనుకుంటారు.
ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆయన మరణించాక ఆయనకు సంబంధించిన వస్తువులను వేలం వేసినట్టే ఆయన 'మూన్ వాకింగ్' షూ (పాదరక్షలు), టోపీని వేలం వెయ్యగా అవి రికార్డు స్థాయి ధర పలికాయి. లండన్ లో జరిగిన ఈ వేలంలో ఇవి 37,343 అమెరికన్ డాలర్లకు అమ్ముడయ్యాయి. ఇంతకు ముందూ మైఖేల్ వాడిన చేతి తొడుగులను వేలం వెయ్యగా అవి రికార్డు స్థాయిలో 350,000 డాలర్లు అమ్మడయ్యాయి. ఈ షూ, టోపీ లను సెప్టెంబరు, 2001 లో న్యూయార్క్ మీద దాడులు జరగడానికి ముందు రోజు జరిగిన షోలో జాక్సన్ ఉపయోగించారు.


Click it and Unblock the Notifications











