మైఖేల్ ను కడదేర్చిన వ్యక్తిగత వైద్యుడు..!!
పాప్ సంగీత ప్రపంచంలో తిరుగులేని మహారాజుగా వెలుగొందిన పాప్ మాంత్రికుడు మైఖేల్ జాక్సన్ అకాల మరణం వెనుక మిస్టరీ వీడింది. ఆయనది సహజ మరణం కాదు అని వాదించిన కుటుంబసభ్యుల, అభిమానుల అనుమానం నిజమయింది. మైఖేల్ ది ముమ్మాటికీ హత్యే అని తెలియజెప్పే వార్తను బ్రిటీష్ పత్రిక "న్యూస్ ఆఫ్ ది వరల్డ్" బయటపెట్టింది. గత సంవత్సరం జూన్ 25వ తేదీన మైఖేల్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆ తర్వాత జులై 7వ తేదీన షెరిల్ మెక్ విల్లీ విడుదల చేసిన డెత్ సర్టిఫికెట్ లో ఆయన మరణానికి గల కారణాన్ని వెళ్లడించలేదు. కానీ ఆ తర్వాత ఆగస్ట్ 31న క్ట్రిస్టఫర్స్ రోజర్స్ అనే వైద్యాధికారి జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ లో ఆయనది సహజ మరణం కాదని ఆయన వెళ్లడించారు.
ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా 'ప్రొపొఫాల్' అనే మాదక ద్రవ్యాన్ని మోతాదుకు మించి ఇవ్వడం తో ఆయన మృతి చెందినట్టు క్ట్రిస్టఫర్స్ వెళ్లడించారు. ఈ రిపోర్ట్ తో జాక్సన్ వ్యక్తిగత వైద్యుడు డా.ముర్రే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లాస్ ఏంజిల్స్ పోలీస్ వారు ఆయనపై హత్యా అభియోగం కింద కేసును నమోదుచేసారు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా లాయన్ ను నియమించుకున్నారు. కాగా ఈ వార్త పై స్పందించిన మైఖేల్ కుటుంబ సభ్యులు పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని వారు తప్పక జాక్సన్ మరణానికి కారణం అయినవారిని శిక్షిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











