ఈ సారీ మొదటి స్థానం మైఖేల్ జాక్సన్‌దే
న్యూ యార్క్ : చనిపోయి ఐదేళ్లు గడచినా పాప్‌స్టార్ మైఖేల్ జాక్సన్ ఆదాయం చెక్కుచెదరలేదు. ఆయన ఎస్టేట్, ఆల్బమ్‌లతో ఇప్పటికీ 141 మిలియన్ డాలర్ల వార్షిక రాబడి వస్తోంది. ఫలితంగా ఫోర్బ్స్ కీర్తిశేషులైన సెలెబ్రిటీల జాబితాలో వరుసగా రెండోసారీ ఆయనే అగ్రస్థానంలో నిలిచారు.
2013లో కూడా మొదటి స్థానం ఈయనకే దక్కింది. ఫోర్బ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండో స్థానంలో గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ ఉన్నాడు. 1977లో చనిపోయిన ఆయన పేరుమీద ఇప్పటికీ 55 మిలియన్ డాలర్ల సంపాదన వస్తోంది.

మూడో స్థానంలో కార్టూనిస్ట్, పీనట్ కామిక్ సృష్టికర్త ఛార్లెస్ షుల్జ్ ఉన్నారు. ఆయన పేరున 40 మిలియన్ డాలర్ల రాబడి వస్తోంది. ఈ వార్త విన్న మైకల్ జాక్సన్ అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఆ విషయాన్ని పోస్ట్ తమ ఆరాధ్య దైవాన్ని మరోసారి స్మరించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











