'పెప్సీ క్యాంపెయిన్' లో పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ చిత్రం
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ చిత్రాన్ని ప్రముఖ కోకాకోలా కంపెనీ పెప్సీ కోసం ఓ సరి క్రొత్త ప్రకటనల కోసం ప్రచారం చేసేందుకు ఉపయోగించనున్నారు. అంతర్జాతీయంగా కోకాకోలా తన ఉత్పత్తిని పెంపొందించుకునే భాగంలో మైఖేల్ జాక్సన్ చిత్రాన్ని ఉపయోగించుకుంటామని జాక్సన్ ఎస్టేట్ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ క్యాంపెయిన్‌ని ప్రపంచంలో మొదటి సారిగా అమెరికా, చైనాలో ప్రవేశపెట్టనున్నారు. సంవత్సరం మొత్తం ఈ క్యాంపెయిన్‌ని 25 దేశాలలో నిర్వహించనున్నారు. మొదటగా ఒక టివి ప్రకటన ద్వారా మైఖెల్ జాక్సన్ చిత్రం ఉన్నటువంటి బ్లూ కలర్ క్యాన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
బ్యాడ్ ఆల్బమ్ 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్బంగా వినియోగదారులు బ్యాడ్ ఆల్బమ్‌కు చెందిన రీమిక్స్ ట్రాక్‌లను పెప్సీ క్యాన్స్‌పై ఉన్న బార్ కోడ్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 1984లలో మైఖెల్ జాక్సన్ పెప్సీ కమర్షియల్ షాట్‌కి పెట్టింది పేరు. ఆ సమయంలో ఓ అధ్బుతమైన ప్రదర్శనను మైఖెల్ జాక్సన్ కనబరుస్తుంటే సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి.. జాక్సన్ తలపై ఉన్న జుట్టు గాయపడిన విషయం తెలిసిందే. 2009వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం ఎంతగానో ప్రేమించిన మైఖెల్ జాక్సన్ స్వర్గస్తులైనారు.


Click it and Unblock the Notifications











