twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైకెల్‌ జాక్సన్‌ పై ఆరోపణలు నిజమే(ఫోటోలు)

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : మైకెల్‌ జాక్సన్‌ 2009 జూన్‌ 25న మరణించినా ఆయన మరణం ఇప్పటికే రహస్యంగానే ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన మృత్యు భయంతో మందులకు (ఔషదాలకు) బానిసయ్యాడనే ఆరోపణలను నిజం చేకూర్చేలా ఆయన పడక గదిలో ఇప్పటి వరవకు వెలుగు చూడని చిత్రాలు బయటపడ్డాయి.

    అందులో పెట్టెలకు పెట్టెలు మందులు, ఐవీ ప్లూయిడ్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆయన వైద్యుడు డాక్టర్‌ కనార్డ్‌ ముర్రే మెడికల్‌ కిట్‌లు వెలుగు చూయి. ముర్రే తప్పుడు హెచ్చరికల వల్లే జాక్సన్‌ మృతి చెందాడని, తన కుమారుడి మరణంపై తగిన దర్యాప్తు జరగలేదని జాక్సన్‌ తల్లి కేథరిన్‌ ఆరోపిస్తున్నారు.

    Michael Jackson's bedroom photographs released

    మరో ప్రక్క 2009లో ప్రముఖ పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ మృతికి ఆయన వైద్యుడు కాండ్రాడ్ ముర్రేనే అబుద్ధి పూర్వకంగా కారణమని సుపీరియర్ కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది సభ్యులు గల జ్యూరీ డాక్టర్ ముర్రేను దోషిగా తేల్చింది. అత్యంత శక్తివంతమైన మత్తుమందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లే జాక్సన్ మృతి చెందాడని కోర్టు పేర్కొంది. ముర్రేకు కోర్టు హాలులోనే సంకెళ్లు వేసి పోలీసులు తీసుకు వెళ్లారు. ఇతనికి శిక్షను త్వరలో ఖరారు చేయనున్నారు.

    పూర్తిగా నిండిపోయిన కోర్టు హాలులో న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో ముర్రే నుండి ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. జాక్సన్ తల్లి కేథరిన్, తండ్రి జో, తోబుట్టువులు రాండీ, జెర్మైన్, రేబీ మరియు లాతోయా ఆ సమయంలో కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు వెలువడగానే జాక్సన్ తల్లిని రాండీ కౌగిలించుకుంది. ముర్రేకు నాలుగేళ్ల శిక్ష పడే అవకాశముంది. అతడి డాక్టర్ లైసెన్స్ కూడా కోల్పోనున్నాడు. తీర్పు వెలువడగానే పెద్ద సంఖ్యలో కోర్టు బయట గుమికూడిన జాక్సన్ అభిమానులు ఆనందంతో నినాదాలు చేశారు.

    English summary
    These are the shocking images which further detail Michael Jackson's tragic spiral into prescription pill dependency, revealed as his family pursue a lawsuit against his concert promoters. The evidence pictures, released by the Los Angeles Police Department this week, show numerous pill bottles, oxygen tanks and medical supplies littered around the superstar's bedroom at the time of his death on June 25, 2009. One image, which was not among the dozens of pictures shown as part of the Conrad Murray manslaughter trial, reveals a metal stand with a hanging bag of intravenous fluids attached.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X