మైకేల్ జాక్సన్ కుమార్తె ఆత్మహత్యాయత్నం...

పారిస్ మందులను మోతాదుకు మించి తీసుకుందని ఒకరు చెప్తూండగా, మణికట్టుపై కోసుకున్న గాయలు ఉన్నాయని చెప్తున్నారు. పారిస్ ఆత్మహత్యా ప్రయత్నానికి ముందు ప్రెండ్స్ కు ట్వీట్ చేసింది. మీట్ క్లీవర్‌తో ఆమె కుడి చేయి మణికట్టును కోసుకుందని అంటున్నారు. ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టింది.
ఆ ట్వీట్ లో...కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయి...కష్టాలకు దూరంగా ఉన్నానని అనుకున్నా కానీ,ఇప్పుడవి ఇక్కడే తిష్ట వేసుకు కూర్చున్నాయని ట్వీట్టర్ లో రాసింది. ఆమె తండ్రి మరణమే ఆమెను క్రుంగతీసిందని, దాని నుంచి ఆమె ఇంకా బయిటపడలేదని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణం ఏమిటా అని ఆరా తీస్తున్నారు.
2009లో మైకెల్ జాక్సన్ మరణించాడు. తండ్రిపై అమితమైన ప్రేమ కారణంగా ఆమె డిప్రెషన్‌కు గురైందని, గతంలో కూడా డిప్రెషన్‌కు చికిత్స తీసుకుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











