ఆన్‌లైన్‌లో రికార్డు స్దాయిలో ధర పలికిన మైకేల్ జాక్సన్ జాకెట్
లాస్ ఏంజెలిస్: పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ధరించిన ఓ జాకెట్‌ను ఆన్‌లైన్‌లో వేలం వేయగా భారీ ధర పలికింది. 'థ్రిల్లర్" మ్యూజిక్ వీడియోలో జాక్సన్ ధరించిన నలుపు, ఎరుపు రంగుల్లోని ఈ జాకెట్‌ను ఓ ఔత్సాహికుడు దాదాపు రూ. 8.1 కోట్లు చెల్లించి కొనుక్కున్నాడు. దీన్ని ఆస్టిన్స్ డెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ప్రదర్శించి వచ్చిన డబ్బుతో చిన్నారుల సంక్షేమానికి కృషిచేస్తానని ఈ జాకెట్‌ను దక్కించుకున్న మిల్టన్ వారెట్ పేర్కొన్నారు. 2009లో ఈ జాకెట్‌ను మైకేల్ జాక్సన్ తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన డెనిస్ టాంప్కిన్స్, మైకేల్ బుష్‌లకు కానుకగా ఇచ్చాడు. దాన్నిప్పుడు ఓ సంస్థ వేలానికి పెట్టింది.


Click it and Unblock the Notifications











