For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా నాన్నది ప్లాన్ ప్రకారం చేసిన హత్యే, నా పై ఎన్నో సార్లు రేప్ : మైకేల్‌ జాక్సన్‌ కుమార్తె

    By Srikanya
    |

    లాస్‌ఏంజెల్స్‌: మైకెల్‌ జాక్సన్‌ 2009 జూన్‌ 25న మరణించినా ఆయన మరణం ఇప్పటికే రహస్యంగానే ఉందన్న సంగతి తెలిసిందే. ఆ విషయమై ఇప్పటికీ రకరకాల వార్తలు చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా మరో ఆరోపణ వచ్చింది.

    కింగ్‌ ఆఫ్‌ పాప్‌ మైకేల్‌ జాక్సన్‌ సాధారణంగా చనిపోలేదని ఆయన్ని చంపేశారని జాక్సన్‌ కుమార్తె పారిస్‌ జాక్సన్‌ ఆరోపించారు. 18 ఏళ్ల పారిస్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసింది. 2009లో పథకం ప్రకారమే తన తండ్రిని చంపేశారని పారిస్‌ తెలిపింది. ఇంతకుముందు ఆయన ఎవరో తనని చంపాలని చూస్తున్నారని ఏదో ఒకరోజు కచ్చితంగా చంపేస్తారని డాడీ మైఖెల్‌ తనతో అంటుండేవారని పారిస్‌ పేర్కొంది.

    ఆయన హత్యకు గురయ్యారన్న విషయం ఇంట్లో వారికి, అభిమానులకు అందరికీ తెలుసని ఎప్పటికైనా తన తండ్రి కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఇది తనకొక చదరంగంలా ఉందని పారిస్‌ చెప్పుకొచ్చింది.

    Michael Jackson was murdered, daughter Paris claims

    అలాగే...తాను 14 సంవత్సరాల వయస్సులో తాను టీన్ గా 14 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు రేప్ పలుమార్లు గురి అయ్యానని, చాలా సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసానని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తాను డిప్రెషన్ కు గురి అయ్యినప్పుడు తన తండ్రికి వాడిన మందులనే వాడారని ఆమె చెప్పింది.

    పారిస్ జాక్సన్... ఆట పాటల్లో ముందున్నా.. కుటుంబంలో విబేధాలు, తీవ్ర మానసిక ఒత్తిడి, తండ్రి కలవరింపులతో... ఇబ్బంది పడుతుండేది. రోవ్‌, మైకేల్‌... దంపతుల రెండో సంతానమే పారిస్ జాక్సన్. రోవ్, మైకేల్ జాక్సన్‌లు పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. ఇటీవలే... పారిస్ జాక్సన్ తల్లికి దగ్గరయ్యారు. ఈ సమయంలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.

    పారిస్ జాక్సన్ కెరీర్ విషయానికి వస్తే... నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ టీవీ కార్యక్రమాల్లో నటిస్తోంది. హాలీవుడ్లో నటిగా రాణించాలనే లక్ష్యంతో పారిస్ జాక్సన్ ముందుకు సాగుతోంది.

    English summary
    Paris Jackson, the 18-year-old daughter of Michael Jackson, has claimed her superstar father was murdered in 2009 in what she describes as a 'setup' .Paris also revealed she was raped as a teen and opened up about her struggles with drug use and surviving 'multiple' suicide attempts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X