twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని

    By Kuladeep
    |

    Michael Jackson
    పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ సోదరి జానెట్ జాక్సన్ ఇటీవల జరిగిన ఓప్రా టాక్ షోలో పాలుపంచుకుంది. ఇందులో తన సోదరుడు మైఖేల్ జాక్సన్ గురించి మాట్లాడిన ఈమె మైఖేల్ డ్రగ్స్ కు బానిస అవ్వడం తదితర పరిణామాల గురించి వివరంగా మాట్లాడారు. తన తల్లిదండ్రులు, సోదరులు అందరూ కలసి ఎన్ని సార్లు డ్రగ్స్ వాడటం మానివేయమని, మానసిక చికిత్సాలయానికి వెళ్లమని చెప్పినా తన సోదరుడు వినలేదని.. దానికి తనతో పాటు మేము కూడా తనని కోల్పోయి తగిన మూల్యం చెల్లించుకున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

    తనలో లోపం వుంది అని నమ్మడానికి మైఖేల్ ఒప్పుకోలేదని, అందుకు అతను మానసికంగా సిద్ధంగా లేడని ఆమె చెప్పింది. లోపం వుండటం తప్పు కాదు, అది సరిదిద్దుకోకపోవడం తప్పు అని అతను గ్రహించలేకపోయాడని ఆమె వ్యాఖ్యానించింది. అయినా తను పడుతున్న అవస్థలను చూసి మేము తట్టుకోలేకపోయే వాళ్లం. అతనికి ఇలాంటి రోజు తప్పక వస్తుందని భయపడేవాళ్లం. అందరం అనుకున్నట్టుగానే నా సోదరుడు ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కంటతడి పెట్టుకుంది. అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని. వారి మాట వింటే తనకీ గతి పట్టేదా..!?

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X