తనింకో సంవత్సరం పాటు బ్రతకచ్చు అంతే..
హాలీవుడ్ నటి లిండ్సే లొహానా గురించి మరో సారి ఆమె తండ్రి మైఖేల్ సారీ సారీ ఆమె వింటే కోప్పడుతుంది, ఆమె మాజీ తండ్రి తిరిగి మీడియా ముందు వ్యాఖ్యలు చేసాడు. ఈ సారి లిండ్సే మరెంతో కాలం బ్రతకదు అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు. ఆమె మరో సంవత్సరం, మరో నెల లేదంటే ఓ వారం బ్రతకచ్చు అంతే.. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏమవుతుందో అని విచారం వ్యక్తం చేసారు. ఆమె నిరంతరం అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకొంటోందని, దీనికి ఆమె తల్లి కారణమని ఆవేదన వ్యక్తం చేసారు.
దీనిపై స్పందిన లిండ్సే ఎవరో తన తండ్రి అని చెప్పుకొనే వ్యక్తి తన మీద అంత జాలి చూపడం ఎందుకో..అయినా ఇంకొకరు చెబితే నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఘాటుగా స్పందించింది. కాగా ఇంతకు ముందు మితిమీరి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆమె ఆస్పత్రిపాలయిన విషయం తెలిసిందే...


Click it and Unblock the Notifications











